సీమలో వైసీపీ సుడిగాలి

కర్నూలు జిల్లాలో వైసీపీ క్లీన్ స్వీప్

అనంతపురంలోనూ అదే పరిస్థితి

తాడిపత్రిలో సత్తాచాటిన జే.సీ.కుటుంబం

(జానోజాగో వెబ్ న్యూస్-పొలిటికల్ బ్యూరో)

రాయలసీమ ప్రాంతంలో తొలినుంచి తన ఆధిపత్యం ప్రదర్శిస్తూ వస్తున్న వైసీపీ మొన్నటి పంచాయతీ ఎన్నికల్లోనూ, ప్రస్తుత మున్సిపాలిటీ ఎన్నికల్లోనూ అదే ప్రభావాన్ని చూపింది. కర్నూలులో క్లీన్ స్వీప్ చేసి తన సత్తాను చాటింది. అనంతపురం జిల్లాలలోనూ దాదాపు అన్ని స్థానాలను కైవసం చేసుకొంది. అయితే తాడిపత్రి మున్సిపల్ ఎన్నికల్లో మాత్రం జే.సీ.కుటుంబం తన ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. ఈ ఎన్నికల్లో టీడీపీ మెరుగైన సీట్లు సాధించి వైసీపీ కంటే ముందు నిలచింది. కర్నూలు జిల్లాలో జరిగిన మున్సిపల్ ఎన్నికలల్లో వైసీపీ హవా కొనసాగింది. జిల్లాలోని ఏడు మున్సిపాలిటీలు, ఒక కార్పొరేషన్, ఒక నగర పంచాయతీని వైసీపీ కైవసం చేసుకుంది. వైసీపీకి తిరుగులేని విజయాన్ని ఓటర్లు అందించారు. ఎంతో ఆశలు పెట్టుకున్న టీడీపీకి పరాభావం తప్పలేదు. జనసేన పత్తా లేకుండా పోయింది. దాదాపుగా టీడీపీకి సమానంగా ఇండిపెండెంట్స్ సీట్లు సాధించారు. డోన్ మున్సిపాలిటీలో సీపీఎంబోణీ కొట్టింది. డోన్‌లో టీడీపీ కొట్టుకుపోయింది. ఆళ్లగడ్డ మున్సిపాలిటీ, గూడూరు నగర పంచాయతీలో బీజేపీ కొంతమేర ప్రభావం చూపెట్టింది. ఆత్మకూరు మున్సిపాలిటీలో టీడీపీకి 1 సీటు రాగా 2 చోట్ల ఇండిపెండెంట్లు విజయం సాధించారు.  కర్నూల్ కార్పొరేషన్: నగరంలో మొత్తం 52 వార్డులు ఉన్నాయి. వీటిలో ఏకగ్రీవాలను కలుపుకొని మొత్తం 41 స్థానాలను వైసీపీ గెలుచుకుంది. టీడీపీ 8 చోట్ల విజయం సాధించింది. ఇండిపెండెంట్లు 3 చోట్ల విజయం సాధించి తమ సత్తా చాటుకున్నారు. మేయర్, డిప్యూటీ మేయర్‌‌గా వైసీపీ అభ్యర్థులు ఉండనున్నారు. ఆదోని మున్సిపాలిటీ: ఆదోని మున్సిపాలిటీలో  ఏకపక్ష విజయాన్ని వైసీపీ సొంతం చేసుకుంది. ప్రతిపక్షాలకు దిమ్మ తిరిగేలా షాక్ ఇచ్చింది. ఈ మున్సిపాలిటీలో ఉన్న 42 వార్డులకు గాను 40వార్డులలో వైసీపీ విజయ పతాకం ఎగురవేసింది. టీడీపీ 1 స్థానంలో, ఇండిపెండెంట్ 1 స్థానంలో విజయం సాధించారు. డోన్ మున్సిపాలిటీ: ఈ మున్సిపాలిటీలోకూడా ఏకపక్ష విజయాన్ని వైసీపీ సొంతం చేసుకుంది. మొత్తం 32 వార్డులకు గాను ఏకగ్రీవాలను కలుపుకొని 31 స్థానాలలో వైసీపీ తిరుగులేని విజయాన్ని సాధించింది. 1 స్థానంలో సీపీఎం గెలుపొందింది. ఇక్కడ టీడీపీ ఒక్క స్థానాన్ని కూడా గెలుచుకోలేదు. ఇక్కడ టీడీపీకి చావు దెబ్బ తగిలింది. ఇక్కడ జనసేన అడ్రస్ గల్లంతయింది. 

 


ఆళ్లగడ్డ మున్సిపాలిటీ: ఈ మున్సిపాలిటీలో మొత్తం 27 వార్డులు ఉన్నాయి. వీటిలోని ఏకగ్రీవాలను కలుపుకొని 22 స్థానాలలో  వైసీపీ విజయం సాధించింది. 2 చోట్ల టీడీపీ, 2 చోట్ల బీజేపీ, 1 చోట ఇండిపెండెంట్ విజయం సాధించారు. ఈ మున్సిపాలిటీలో బీజేపీ బోణీ కొటింది. 

ఆత్మకూరు మున్సిపాలిటీ : ఈ ఈ మున్సిపాలిటీలోకూడా ఏకపక్ష విజయాన్ని వైసీపీ సొంతం చేసుకుంది. మొత్తం 24 వార్డులుఉన్నాయి. వీటిలో ఏకగ్రీవాలు కలుపుకొని 21 స్థానాలలో  వైసీపీ విజయం సాధించింది. 1 చోట  టీడీపీ, 2 చోట్ల ఇండిపెండెంట్లు విజయం సాధించారు.  

ఎమ్మిగనూరు మున్సిపాలిటీ: ఈ మున్సిపాలిటీలో 34 వార్డులు ఉన్నాయి. వీటిలో 31 స్థానాలను వైసీపీ సొంతం చేసుకుంది. కేవలం 3 స్థానాలలో టీడీపీ విజయం సాధించింది. 

నందికొట్కూరు మున్సిపాలిటీ: ఈ మున్సిపాలిటీలో మొత్తం 29 వార్డులు ఉన్నాయి.  ఏకగ్రీవాలను కలుపుకొని 21 స్థానాలలో వైసీపీ విజయం సాధించింది. 1 చోట టీడీపీ గెలుపొందింది. 7 చోట్ల ఇండిపెండెంట్స్ విజయం సాధించారు. ఇక్కడ టీడీపీ కన్నా ఇండిపెండెంట్స్  ఎక్కువ స్థానాలలో విజయం సాధించారు. 

నంద్యాల మున్సిపాలిటీ: ఏకగ్రీవాలను కలుపుకొని 37 స్థానాలలో వైసీపీ ఘన విజయం సాధించింది. 4 చోట్ల టీడీపీ, 1 చోట ఇండిపెండెంట్ విజయం సాధించారు. ఈ  మున్సిపాలిటీలో మొత్తం 42 వార్డులు ఉన్నాయి. 

గూడూరు నగర పంచాయతీ: ఇక్కడ మొత్తం  20వార్డులు ఉన్నాయి. 12 వార్డులలో వైసీపీ విజయం సాధించింది. 3 వార్డులలో టీడీపీ, 1 వార్డులో బీజేపీ, 4 వార్డులలో ఇండిపెండెంట్లు విజయం సాధించారు. 

అనంతపురం జిల్లాలో కీలక మున్సిపాలిటీ టీడీపీ కైవసం

అనంతపురం జిల్లా వ్యాప్తంగా 337 వార్డుల్లో మున్సిపల్ ఎన్నికలు జరిగాయి. అనంతపురం కార్పొరేషన్, 8 మున్సిపాలిటీలు 02 నగర పంచాయతీలు ఉన్నాయి. అనంతపురం కార్పోరేషన్ మొత్తం ఏకగ్రీవం అయింది. అనంతపురం కార్పొరేషన్ మొత్తం స్థానాలు 50 ఉండగా, వైసీపీ 48, టీడీపీ 0, ఇండిపెండెంట్ 2 స్థానాల్లో గెలుపొందింది. ధర్మవరం మున్సిపాలిటీ మొత్తం వార్డులు 30 ఉండగా, వైసీపీ 30, టీడీపీ 0, గుత్తి మున్సిపాలిటీ మొత్తం వార్డులు 19 ఉండగా, వైసీపీ 18, టీడీపీ 1 స్థానంలో గెలిచింది.

గుంతకల్ మున్సిపాలిటీ మొత్తం వార్డులు 34 ఉండగా, వైసీపీ 25, టీడీపీ 7, సీపీఐ 1 స్థానంలో ఘన విజయం సాధించింది. హిందూపురం మున్సిపాలిటీ మొత్తం వార్డులు 38 ఉండగా, వైసీపీ 29, బీజేపీ 1, టీడీపీ 6, ఎంఐఎం 1, ఇండిపెండెంట్ 1 స్థానంలో గెలిచింది.

కదిరి మున్సిపాలిటీ మొత్తం వార్డులు 36 ఉండగా, వైసీపీ 30, టీడీపీ 5, ఇండిపెండెంట్ 1 స్ధానంలో విజయం సాధించింది. కళ్యాణదుర్గం మున్సిపాలిటీ మొత్తం వార్డులు 24 ఉండగా, వైసీపీ 19, టీడీపీ 4, ఇండిపెండెంట్ 1 స్థానంలో విజయం సాధించింది. మడకశిర మున్సిపాలిటీ మొత్తం వార్డులు 20 ఉండా, వైసీపీ 15, టీడీపీ 5 స్థానాల్లో గెలిచింది. పుట్టపర్తి మున్సిపాలిటీ మొత్తం వార్డులు 20 ఉండగా, వైసీపీ 14, టీడీపీ 6 స్థానాల్లో గెలిచింది. రాయదుర్గం మున్సిపాలిటీ మొత్తం వార్డులు 32 ఉండగా, వైసీపీ 30, టీడీపీ 2 స్థానాల్లో గెలిచింది. తాడిపత్రి మున్సిపాలిటీ మొత్తం వార్డులు 34 ఉండగా, టీడీపీ 18, వైసీపీ 14, సీపీఐ 1, ఇండిపెండెంట్ 1 స్థానంలో గెలుపొందింది.

ఈ విజయం ప్రజలది-జేసీ ప్రభాకర్ రెడ్డి

మున్సిపల్ ఎన్నికల్లో సాధించిన విజయం ప్రజలదని, వారికి పాదాభివందనం చేస్తున్నానని మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నేత జేసీ ప్రభాకర రెడ్డి అన్నారు. ‘సేవ్ తాడిపత్రి’ అన్న పదం ప్రజల నుంచే వచ్చిందని, అందుకే ఈ స్థాయిలో విజయం వరించిందని తెలిపారు. రెండు సంవత్సరాల పాలనను బేరీజు వేసుకొని, టీడీపీ అండగా ఉంటారన్న నమ్మకంతోనే ప్రజలు టీడీపీకి ఓట్లు వేశారని అన్నారు. తాడిపత్రి ప్రజలు అభ్యర్థిని చూడలేదని, తాడిపత్రిని కాపాడుకోవాలన్న ఏకైక ధ్యేయంతో ఉన్నారని వ్యాఖ్యానించారు. తాడిపత్రి ప్రజలను, ఎమ్మెల్యేను కలుపుకొని, ఒకే పార్టీగా పనిచేస్తామని, ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటానని జేసీ ప్రభాకర రెడ్డి హామీ ఇచ్చారు. 

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: