జే.సీ. వ్యాఖ్యలు తీవ్ర మనస్తాపం కలిగించాయి

కాంగ్రెస్ నేత జి.నిరంజన్

(జానోజాగో వెబ్ న్యూస్-హైదరాబాద్ బ్యూరో)

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును కోరి కాంగ్రెస్ పార్టీని నాశనం చేశారని మాజీ మంత్రి జే.సీ.దివాకర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు తెలంగాణ వాసులను తీవ్ర మనస్తాపానికి గురిచేశాయనితెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధికార ప్రతినిధి, ఏఐసీసీ సభ్యులు జి.నిరంజన్ పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. ఆ ప్రకటన సారాంశం ఇలావుంది... రాష్ట్ర అసెంబ్లీ లోని సి.ఎల్.పి. ఆఫీస్ లో సి.ఎల్..పి నాయకుడు భట్టి విక్రమార్క, శాసన మండలి సభ్యుడు జీవన్ రెడ్డిలతో, మాజీ మంత్రి జె.సి.దివాకర్ రెడ్డి జరిపిన సరదా సంభాషణలో తెలంగాణా ఏర్పాటును కోరి కాంగ్రెస్ ను నాశనము చేసారని వాఖ్యానించడము భాదాకరము. ఈ వాఖ్యలు తెలంగాణ ప్రజలు, కాంగ్రెస్ కార్యకర్తలను తీవ్ర మనస్తాపానికి గురిచేశాయి. కాంగ్రెస్ నష్టపోవడానికి కారణము తెలంగాణను అడ్డుకోవడానికి ఆంధ్ర కాంగ్రెస్ నాయకులు చేసిన కుతంత్రాలు, ముఖ్యమంత్రి కావాలనే తెలంగాణ నాయకుల అంతర్గత పోరే కారణం, తెలంగాణ రాష్ఠ్ర ఏర్పాటు పై డిసెంబర్,9,2009 న కేంద్ర ప్రభుత్వము చేసిన ప్రకటనకు కట్టుబడి ఉంటే పరిస్థితులు భిన్నముగా ఉండేవని గమనిస్తే మంచిది. ఎన్నికలలో కాంగ్రెస్ గెలువకున్నా , తెలంగాణ ప్రజల చిరకాల వాంచను సొనియా గాంధి సాకారాము చేశారనే తృప్తి అటు ప్రజలకు ఇటు కాంగ్రెస్ కార్యకర్తల్లో ఉందని జె.సి. గమనించాలి. అని నిరంజన్ పేర్కొన్నారు..

,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి 

 


Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: