పరిశుద్ద్య సమస్యను పరిష్కరించండి

జానోజాగో సంఘం ఏపీ రాష్ట్ర సమన్వయ కర్త షేక్ గౌస్ బాషా

(జానోజాగో వెబ్ న్యూస్-మార్కాపురం ప్రతినిధి)

మార్కాపురం పట్టణంలోని పలు వీధుల్లో కాలువలలోని పూడిక చేత డప్పింగ్ సమస్యను పరిష్కరించాలని జానో - జాగో  ( ముస్లీంల అభివృద్ధి వేదిక) సంఘం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమన్వయ కర్త షేక్ గౌస్ బాషా డిమాండ్ చేశారు. కాలువల్లోని పూడిక తీసి కొన్ని ఇండ్ల వద్ద వేయడం పెద్ద సమస్యగా మారుతోందని ఆయన వెల్లడించారు. పలు వీధులలోని సైడు కాలువలపై శాశ్వత కట్టడాలు కారణంగా, కాలువలలోని మురుగుతో కూడిన  పూడికల చెత్త తీయలేక ఇబ్బందులు పడుతున్నామని స్వయంగా పురపాలక పారిశుద్ధ కార్మికులు తెలియజేస్తున్నారని ఆయన గుర్తుచేశారు.
మార్కాపురం పట్టణ మునిసిపల్ కార్యాలయ శానిటరి ఇనెస్పెక్టర్ షేక్. నాయబ్ రసూల్, శానిటరి సెక్రటరి కె. భాస్కర్ పర్యావేక్షణలో పలు వీధులలోని సైడు కాలువలలలోని పూడికలు తీయించే సందర్భములో కొన్ని చోట్ల కాలువలలపై శాశ్వత కట్టడాలు కట్టిన కారణంగా సరియైన వరుసలో పూడికలు తీయలేక పోతున్నామని  వారు చెప్పినట్లు ఆయన పేర్కొన్నారు. అవకాశమున్న కొన్ని చోట్ల మురికి కాలువలలోని పూడికల చెత్త కొన్ని ఇండ్ల ముందు వేసిన కారణంగా అక్కడి నివాసముండే వారు అభ్యంతరం వ్యక్తంచేస్తున్నారని పారిశుద్ధ్య కార్మికులు చెబుతున్నారని ఆయన తెలిపారు.
ఎక్కడెక్కడో నుంచి నెట్టుకొని వచ్చిన మురుగు నీటితో కూడిన చెత్త మా ఇండ్ల ముందు ఎందుకు తెచ్చి వేస్తున్నారని అక్కడ నివాసముండే ప్రశ్నిస్తున్నారని, వారి ఆవేదన, అక్కడి పరిస్తితి తాము అర్థం చేసుకొన్నా వారికి సమాధానం ఇవ్వలేని పరిస్థితి అని మున్సిపల్ అధికార్లు సైతం నిర్లిప్తతను వ్యక్తంచేస్తున్నారని గౌస్ బాషా పేర్కొన్నారు. కాలువలపై కట్టిన శాశ్వత నిర్మాణాల కారణంగా తాము కొందరికి కలుగుతున్న ఇబ్బందిపై వారి ప్రశ్నలకు తాము సమాధానం చెప్పలేక పోతున్నామని శానిటర్ ఇనెస్పెక్టర్ షేక్. నాయబ్ రసూల్, శానిటరి సెక్రటరి కె. భాస్కర్ తోపాటు పారిశుద్ధ కార్మికులైన కాశయ్య, నాగేంద్ర ఆవేదన వ్యక్తపరిచారని గౌస్ బాషా తెలిపారు. దయచేసి సంబంధిత అధికారులు స్పందించి ఈ సమస్య వల్ల గురవుతున్న ప్రజలకు న్యాయం చేయవలసిందిగా షేక్ గౌస్ బాష విజ్ఞప్తి చేశారు.


 ,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి 
 

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: