నంద్యాల మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికకు ఏర్పాట్లు

జాయింట్ కలెక్టర్ రామ్ సుందర్ రెడ్డి

(జానోజాగో వెబ్ న్యూస్-కర్నూలు జిల్లా ప్రతినిధి)

నంద్యాల మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికకు ఏర్పాట్లు సర్వం సిద్ధం చేశామని నంద్యాల మున్సిపల్ సహాయ ఎన్నికల అధికారి, కమిషనర్ వెంకట కృష్ణ అన్నారు. బుధవారం నంద్యాల మున్సిపల్ కార్యాలయంలోని సమావేశ భవనంలో గురువారం జరిగే మున్సిపల్ చైర్ పర్సన్, వైస్ చైర్ పర్సన్ ఎన్నిక కొరకు ఏర్పాట్లను ఆయన పరిశీలించారు. మున్సిపల్ కమిషనర్ వెంకటకృష్ణ మాట్లాడుతూ గురువారం జిల్లా జాయింట్ కలెక్టర్ రామ్ సుందర్ రెడ్డి అధ్యక్షతన మున్సిపల్ చైర్ పర్సన్, వైస్ చైర్ పర్సన్ ఎన్నిక కొరకు నంద్యాల మున్సిపల్ కార్యాలయం సమావేశ భవనంలో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామని, కార్యక్రమంలో  తొలుతగా ఎన్నిక కాబడిన కౌన్సిలర్స్ ప్రమాణ స్వీకారం చేస్తారని, అనంతరం ఎన్నిక కాబడిన 42 మంది కౌన్సిలర్లు నంద్యాల ఎంపీ, శాసనసభ్యులు, ఎమ్మెల్సీ మొత్తం 45 మంది మాత్రమే ఈ సమావేశ భవనంలో  మున్సిపల్   చైర్మన్ను, వైస్ చైర్మన్   ను ఎన్నుకోవడం జరుగుతుందన్నారు. తదనంతరం ఇంతవరకూ ప్రత్యేక అధికారిగా ఉన్నటువంటి జాయింట్ కలెక్టర్  ఎంపిక కాబడిన చైర్ పర్సన్ కు  బాధ్యతలను అప్పగించనున్నట్లు ఆయన తెలిపారు.

,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి 

 

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: