నామినేషన్ వేసిన

టీఆర్ఎస్ అభ్యర్థి "న్యాయవాది భగత్ "

ప్రచారానికి సిద్దంగా ఉన్న పార్టీ శ్రేణులు

విజయ ఢంకా మోగించేందుకు కసరత్తు

(జానోజాగో వెబ్ న్యూస్-లీగల్ ప్రతినిధి)

తెలంగాణ రాష్ట్ర సమతి పార్టీ అభ్యర్థిగా న్యాయవాది " నోముల భగత్ "" నామినేషన్ వేశారు. తండ్రి నోముల నర్సింహం మృతితో సాగర్ నియోజకవర్గం ఉపఎన్నిక అనివార్యమైంది. సిట్టింగ్ ఎమ్మెల్యేగా తండ్రి స్థానంలో తనయుడిని బరిలో దించి సీటు గెలిపించుకోవాలని ముఖ్యమంత్రి కేసీఆర్ భావించినట్లుగా  సమాచారం.  ఎట్టి పరిస్థతుల్లో గెలుపు తెరాస పార్టీ అభ్యర్థికే దక్కలనే కృత నిశ్చయంతో పార్టీ శ్రేణులు ఉన్నట్లు అనిపిస్తోంది. తండ్రి ఆశయాలను ఆచరణలో పెట్టడానికి తనయుడిని బరిలో దించినట్లు విశ్వసనీయ సమాచారం. సాగర్ నియోజకవర్గంలో అధికంగా ఎస్టీ ఓటర్లు ఉన్నారు. ఎస్టీ వర్గానికి చెందిన వారు తెరాస పార్టీకి, తండ్రి నోముల నర్సింహం వెంటే ఉన్నారు. ప్రస్తుతం లంబాడీ వర్గానికి చెందిన ఓట్లు కీలకంగా మారాయి. ఎస్సీ, రెడ్డి, బీసి, ముస్లీం మైనార్టీలకు చెందిన ఓట్లు సైతం గతంలో తెరాస పార్టీకే నమోదయ్యాయి. మరోవైపు తండ్రి మరణానికి కానుకగా తనయుడిని గెలిపించాలని అక్కడి ప్రజలు భావిస్తున్నట్లు తెలుస్తోంది.

దీంతో సానుభూతి ఓట్లు గెలుపుకు కీలకంగా మారబోతోంది. అధికార పార్టీకి చెందిన నేతలు, కార్యకర్తలు, తెరాస పార్టీ న్యాయవాదులు, ఆలిండియా కేసీఆర్ అభిమాన సంఘం న్యాయవాదులు, ఇంచార్జీలు గెలుపు కోసం గట్టి ప్రయత్నం చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. కాంగ్రెస్ అభ్యర్థి జానారెడ్డి పై తెరాస పార్టీ గెలిచిన విషయం విదితమే. మరోసారి రికార్డు స్థాయిలో భారీ మెజారిటీతో విజయం సాధించడం ఖాయం అని జోస్యం చెపుతున్నారు. నామినేషన్ కోసం సోమవారం జనం అధిక సంఖ్యలో తరలివచ్చారు. ఇది శుభపరణామమని అందరూ ఉత్సాహంగా పాల్గొన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ సమక్షంలో ప్రత్యేక ప్రణాళికలను రూపొంచినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది. భారీ బందోబస్తు నడుమ వచ్చే నెల 17 వ తేదీన పోలింగ్ జరగనుంది. పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకుంటున్నారు. అనుకున్నంత స్థాయిలో ఇతర పార్టీలకు చెందిన అభ్యర్థులు గెలుపు రేసులో నిలువలేక పోవచ్చుననే అభిప్రాయాన్ని రాజకీయ విశ్లేషకులు వెల్లడించారు. నామినేషన్ వేసిన తెరాస అభ్యర్థికి తెలంగాణ పార్టీ న్యాయవాదులు పూర్తి మద్దతును ప్రకటించారు. తెలంగాణ పార్టీ అభ్యర్థిగా నామినేషన్ వేసిన సందర్భంగా తెరాస పార్టీ లీగల్ సెల్ న్యాయవాదులు గోవర్ధన్ రెడ్డి, ఉపేందర్, రవికుమార్ తదితరులు హర్షం వ్యక్తంచేశారు.

✍️ రిపోర్టింగ్-డి.అనంత రఘు

న్యాయవాది. హైదరాబాద్

,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి 

 

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: