బ్యాంకుల ప్రైవేటీకరణ సహించేది లేదు
సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎం  నాగేశ్వరరావు
(జానోజాగో వెబ్ న్యూస్-నందికొట్కూరు ప్రతినిధి)
ప్రభుత్వ బ్యాంకులను ప్రైవేటీకరణ చేస్తే సహించేది లేదని సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎం  నాగేశ్వరరావు హెచ్చరించారు మంగళవారం నందికొట్కూరు లో సిపిఎం కార్యాలయం నుండి పొట్టిశ్రీరాములు విగ్రహం వరకు కు ర్యాలీగా వెళ్లి నరేంద్ర మోడీ దిష్టిబొమ్మను దగ్ధం చేసి రాస్తారోకోకు చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు పకీర్ సాహెబ్ అధ్యక్షత వహించగా ఈ సందర్భంగా సిపిఎం పార్టీ  జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు ఎం నాగేశ్వరరావు సి ఐ టి యు జిల్లా నాయకులు కె భాస్కర్ రెడ్డి ఇ మాట్లాడుతూ 1969లో బ్యాంకులను ను జాతీయకరణ చేయడం జరిగిందని వాటి ఫలితంగా రైతులకు గతంలో 0.2 శాతం మాత్రమే రైతులకు రుణాలు ఇచ్చేవారని నేడు 19 శాతం రుణాలు బ్యాంకు లో రైతులకు అందుతున్నాయని వారన్నారు పొదుపు మహిళలకు దళితులకు పేదవారికి ప్రభుత్వ బ్యాంకుల్లో రుణాలు అందుతున్నాయని అన్నారు నేడు కేంద్రంలో ఉన్న బిజెపి ప్రభుత్వం 14 లక్షల కోట్ల రూపాయలు ఆదాయం ఉన్న ప్రభుత్వ బ్యాంకులను ప్రైవేటీకరణ చేసి ఆ దాని అంబానీ లకు దోచు పెట్టేందుకు ప్రైవేటీకరణ చేస్తున్నారని వారు విమర్శించారు 27 బ్యాంకులను 12 బ్యాంకులకు కుదించడం వలన 10 లక్షల ఉద్యోగాలు తొలగించబడతాయి అని వారు ఆరోపించారు తెలుగు వారి కోడలు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు మొత్తం ప్రభుత్వ రంగాల నీ ఇప్పటికే విద్యుత్తు రైల్వే ఎల్ఐసి రక్షణ రంగం ఇన్సూరెన్స్ రంగం బీమా రంగం విమాన రంగం తదితర వాటిని ప్రైవేటీకరణ చేయడం జరిగిందన్నారు ఈ కార్యక్రమంలో ప్రజా సంఘాల నాయకులు బెస్త రాజు సాజిదా బి రజిత రామ సుబ్బయ్య సుంకన్న రామకృష్ణ ప్రేమ రాజు తదితరులు పాల్గొన్నారు.

,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి 

 

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: