ఢిల్లీ సింగూరు బార్డర్లో రైతు దీక్షకు,,,

ముస్లిం నగారా&టిప్పు సుల్తాన్ యునైటెడ్ ఫ్రంట్ మద్దత్తు

(జానోజాగో వెబ్ న్యూస్-హిందూపురం ప్రతినిధి)

ఢిల్లీ లోని సింధూ బార్డర్ లో రైతు లకు వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వం చేసిన నల్లచట్టాలు వెనక్కు తీసుకోవాలని దాదాపు మూడున్నర నెలలుగా దీక్ష చేస్తున్న రైతులకు సంఘీభావం గా ముస్లిం నగారా&టిప్పు సుల్తాన్ యునైటెడ్ ఫ్రంట్ జాతీయ అధ్యక్షుడు ఉమర్ ఫారూఖ్ ఖాన్ పాల్గొన్నారు. దీక్షా స్థలనుంచి ఉమర్ ఫారూఖ్ ఖాన్ మాట్లాడుతూ దేశాన్ని  జాతీయ ఆస్తులను ఒక్కొక్కటిగా అమ్ముతూ చివరగా అన్నదాత రైతు వ్యవసాయం పై నల్ల చట్టాల రూపంలో ప్రధాని నరేంద్ర మోడీ పడ్డారని

రైతు కంట కన్నీరు కార్చిన రాజ్యాలు రైతు ఉసురు తగిలిన ప్రభుత్వాలు పేకమేడల్లా కూలిపోయాయని ప్రపంచం మొత్తం ప్రధానిమోడీ దుశ్చర్యలను చూస్తోందని లక్షలాది మహిళలు వృద్దులు రైతులు చలిలో గాలిలో వానలో ఎండలో పసిపిల్లలు సైతం దీక్షలో ఉండడం ఇలాంటి దీక్ష దేశంలో స్వాతంత్రానoతరం ఇంత పెద్ద ఎత్తున జరగటం దేశంలోని అన్ని వర్గాలు మద్దత్తు ఇవ్వటం హర్శణీయమని షాహీన్ బాగ్ లా దేశమంతటా కిసాన్ బాగ్ ను దీక్షా స్థలి ని చేసి ప్రతి ఒక్కరూ రైతులు పండించే ధాన్యం పంటలు వంటల రూపంలో తినే ప్రతి ఒక్కరూ ఈ దీక్షకు సంఘీభావం మద్దత్తు తెలపాలని విజ్ఞప్తి చేశారు.

,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి 

 

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: