ఇండియా లెజెండ్స్ ఘనవిజయం

రోడ్డు భద్రతా ప్రపంచ కప్ సీరీస్ ట్రోఫీ భారత్ కైవసం

ఉత్కంఠ పోరులో శ్రీలంకపై భారత్ విజయం

(జానోజాగో వెబ్ న్యూస్-స్పోర్ట్స్ ప్రతినిధి)

రోడ్డు భద్రత లెజెండ్స్ ప్రపంచకప్ సీరీస్ ఫైనల్లో భారత క్రికెట్ జట్టు సమిష్టిగా రాణించి శ్రీలంకపై ఘనవిజయం సాధించి ప్రపంచ ఛాంపియన్స్ గా అవతరించింది. ఆదివారం రాయ్ పూర్  అంతర్జాతీయ క్రికెట్ మైదానంలో జరిగిన ఫైనల్ మ్యాచ్ హోరా హోరీగా సాగింది. ఉత్కంఠ పోరులో భారత్ విజయభేరీ మోగించింది. లెజెండ్స్ భారత క్రికెట్ జట్టు సమిష్టిగా రాణించి కప్ సొంతం చేసుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ జట్టు 20 ఓవర్లలో 181/4 వికెట్లతో నిలిచింది. యూసుఫ్ పఠాన్ 62 పరుగులు, యువరాజ్ సింగ్ 60, కెప్టెన్ సచిన్ టెండూల్కర్ 30 పరుగులతో 181 పరుగులు చేసి ప్రత్యర్థి ముందు సవాల్ విసిరింది. అనంతరం బ్యాటింగ్ ప్రారంభించిన శ్రీలంక జట్టు ఆదిలోనే రెండు వికెట్లు నష్టపోయి కష్టాల్లో పడింది. సనత్ జయసూర్య 46 పరుగులతో జట్టును చక్కదిద్దే సమయంలో వినయ్ కుమార్ మెరుపు వేగంతో కళ్ళు చెదిరే క్యాచ్ పట్టుకుని పెవిలియన్ కు పంపించాడు. చివర్లో లంకేయులను కట్టడి చేసి గొనీ వికెట్ సాధించడంతో మ్యాచ్ మలుపు తిరిగింది. చివరి బంతికి మునాఫ్ పటేల్ వికెట్ తీసి భారత్ కు విజయాన్నందించాడు. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ యూసుఫ్ పఠాన్ అందుకున్నాడు. ఛాంపియన్ గా భారత్ జట్టు కెప్టెన్ సచిన్ టెండూల్కర్ కప్ అందుకుని టైటిల్ కైవసం చేసుకుంది. 

✍️ రిపోర్టింగ్-డి.అనంత రఘు

న్యాయవాది. హైదరాబాద్

,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి 

 

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: