దోస్తాన కొనసాగేనా...?

జనసేన..బీజేపీ స్నేహానికి బీటలు ..?

మున్ముందు ఆ పార్టీల దోస్తీ కొనసాగేనా

తెలంగాణ బీజేపీ తీరుపై పవన్ ఆగ్రహం

గతంలోనూ బీజేపీ తీరుపై జనసేనాని ఇదే తరహా వ్యాఖ్యలు

గౌరవం లేనిచోట స్నేహం చేయాలని కోరుకోవట్లేదు-పవన్ కళ్యాణ్

ఎమ్మెల్సీ ఎన్నికల్లో బాహాటంగా టీఆర్ఎస్ కు జనసేన మద్దతు

పవన్ తీరుపై మండిపడుతున్న కమలం నేతలు

జనసేనాని వ్యవహారం అధిష్టానం వద్దకు

(జానోజాగో వెబ్ న్యూస్-పొలిటికల్ బ్యూరో)

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలలో కీలకశక్తిగా ఎదగాలని భావిస్తున్న బీజేపీ, జనసేన కూటమి కలలు నెరవేరుతాయా...? పైకి దోస్తీతో నడుస్తున్న అంతర్గతంగా ఆ పార్టీల మధ్య ఆధిపత్య పోరు సాగుతోందా...? తాజాగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యాలు అందుకు నిదర్శనమా అంటే అవుననే అంటున్నాయి రాజకీయ వర్గాలు. గతంలోనూ బీజేపీ హైకమాండ్ తీరుపై పవన్ కళ్యాణ్ ఇదే తరహా వ్యాఖ్యాలు చేశారు. స్నేహం రెండువైపుల నుంచి కొనసాగాలని ఆయన అప్పట్లో వ్యాఖ్యానించారు. తాజాగా ఈ వివాదం మరింత ముదిరే అవకాశం కనిపిస్తోంది. ఆ రెండు పార్టీల కలయిక మూన్నాళ్ల ముచ్చటగా మిగిలేట్లు ఉంది. ఈ రెండు పార్టీల మధ్య పొత్తు ఆదిలోనే తెగిపోయే పరిస్థితి ఎదురువుతోంది. జనసేనాని పవన్‌కల్యాణ్ వ్యాఖ్యలను తెలంగాణ బీజేపీ సీరియస్‌గా తీసుకుంది. పొత్తు ధర్మాన్ని పవన్ విస్మరించారని ఈ పార్టీ నేతలు మండిపడుతున్నారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో మద్దతు ఇచ్చినందుకు పవన్‌కు కృతజ్ఞతలు తెలిపామని బీజేపీ నేతలు గుర్తుచేశారు. అయితే ఎమ్మెల్సీ పోలింగ్‌ రోజే టీఆర్‌ఎస్‌కు మద్దతు తెలపడంపై బీజేపీ నేతలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. పవన్‌కల్యాణ్‌ వ్యవహారాన్ని హైకమాండ్‌ దృష్టికి తీసుకెళ్లాలని రాష్ట్ర బీజేపీ నేతలు చెబుతున్నారు. అంతకుముందు పవన్ తెలంగాణ బీజేపీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. తాము కేంద్ర నాయకత్వంతో కలిసి పనిచేస్తున్నా, తెలంగాణ రాష్ట్ర శాఖ తమను అవమానించిందని మండిపడ్డారు. జనసేన ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆయన పార్టీ సమావేశంలో మాట్లాడారు.  జనసేనను చులకన చేసేలా బీజేపీ మాట్లాడిందని ఆరోపించారు. బీజేపీ తమను పదే పదే అవమానిస్తోందని మండిపడ్డారు. అందుకే తాము తెలంగాణలో టీఆర్‌ఎస్ అభ్యర్థి వాణిదేవికి మద్దతిస్తున్నామని వెల్లడించారు. పీవీ ఆర్థిక సంస్కరణలు తెచ్చిన మహానుభావుడని పవన్ కొనియాడారు. 

 


గౌరవం లేనిచోట స్నేహం చేయాలని కోరుకోవట్లేదు-పవన్ కళ్యాణ్

జనసేన పార్టీ నిర్మాణం చురుగ్గా జరుగుతోందని ఆ పార్టీ అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ అన్నారు. హైదరాబాద్‌లోని పార్టీ కార్యాలయంలో జనసేన ఆవిర్భావ దినోత్సవం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా పార్టీ శ్రేణులనుద్దేశించి పవన్‌ మాట్లాడారు. ఖమ్మం ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థులు బలమైన పోటీ ఇస్తారని స్పష్టం చేశారు. అణగారిన వర్గాలు, బీసీలకు రాజ్యాధికారం రావాలని ఆకాక్షించారు. తెలంగాణ నుంచే బలంగా ముందుకెళతామని పవన్‌ స్పష్టం చేశారు. పాలకులు చేస్తున్న తప్పులకు ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, అందుకే పాలకులను, ప్రజలను వేరు చేయాలని కోరుకుంటున్నానన్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో కులం ప్రాతిపదికన రాజకీయాలు జరగడం దురదృష్టకరమన్నారు. సమతుల్యతతో కూడిన బహుజన విధానమే జనసేన ఆకాంక్షఅని పవన్‌ వివరించారు.  

నేతల అభిప్రాయాన్ని గౌరవిస్తున్నా..

‘‘రాష్ట్ర విభజన సమయంలో బీజేపీ మద్దతు తెలిపింది. ఏపీకి మోదీ మద్దతు ఇచ్చినందుకే బీజేపీతో పొత్తు పెట్టుకున్నాం. భూ సంస్కరణలు తెచ్చి పీవీ సీఎం స్థానం పోగొట్టుకున్నారు. పీవీ చితి కాలకుండా అగౌరవపరిచారు. విభజన అన్యాయంతో ఏపీ ఇప్పటికీ కొట్టుమిట్టాడుతోంది. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో జన సైనికులు నిలబడిన విధానం హర్షణీయం. తెలంగాణ నాయకత్వం జనసేనను అంగీకరించలేకపోతోంది. బీజేపీ నేతలు అవమానకరంగా మాట్లాడుతున్నారు. కేంద్రంతో సత్సంబధాలు ఉన్నాయి. తెలంగాణలో మంచి సంబంధం లేదని జనసేన నేతలు బాధపడ్డారు. తమ మనోభావాలు దెబ్బతీయొద్దని తెలంగాణ జనసైనికులు కోరారు. గౌరవం ఇవ్వకపోవడంపై జనసేన నేతలు బాధపడుతున్నారు. పీవీ కుమార్తెకు మద్దతు తెలుపుదామని జనసైనికులు స్పష్టం చేశారు. పీవీ కుమార్తెకు మద్దతు ఇవ్వాలన్న నేతల అభిప్రాయాన్ని గౌరవిస్తున్నా. గౌరవం లేనిచోట స్నేహం చేయాలని కోరుకోవట్లేదు’’ అని పవన్‌ కల్యాణ్‌ తెలిపారు.

,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి 

 

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: