పీవీ ఫోటో పెట్టుకొనే హక్కు కాంగ్రెస్ కే

కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించండి

జి.నిరంజన్

(జానోజాగో వెబ్ న్యూస్-హైదరాబాద్ బ్యూరో)

పీ.వీ.నర్సింహారావు ఫోటో పెట్టుకొనే హక్కు కాంగ్రెస్ పార్టీకి తప్పా మరెవ్వరికీ లేదని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధికార ప్రతినిధి జి.నిరంజన్ పేర్కొన్నారు. పీ.వీ.వారసులను గౌరవిస్తామని కానీ ఆయన ఫోటో పెట్టుకొనే అధికారంమాత్రం కాంగ్రెస్ కే ఉందన్నారు. గాంధీభవన్ లో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఇలా అన్నారు....భారత దేశానికి స్వాతంత్ర్యము సిద్దించి 75 సంవత్సరములు పూర్తవుతున్నందున నేటి నుంచి 75 వారాల పాటు నిర్వహించే అమృతోత్సవాలు ఈ రోజు ప్రధాన మంత్రి  మోడి సబర్మతి ఆశ్రమములో, రాష్ట్ర ముఖ్యమంత్రి కె.సి.ఆర్ హైదరాబాద్ లో ప్రారంభించారు. ఇదే రోజు సాయంత్రము 4 గంటలకు తెలంగాణ రాష్ట్రములో జరుగుతున్న రెండు పట్టభద్రుల నియోజకవర్గ ఎన్నికల గడువు ముగుస్తుంది.1885 సంవత్సరములో కాంగ్రెస్ పార్టీ ఆవిర్భవించి, 62 సంవత్సరముల పాటు చేసిన నిరంతర పోరాటము వలననే, 1947 ఆగష్టు 15న స్వాంత్రంత్య్రము సిద్దించింది. ఆ రోజు కాంగ్రెస్ పార్టీ దేశములో ప్రజాస్వామ్య వ్యవస్థను నెలకొల్పడము వలననే, ఈ రోజు ప్రధాన మంత్రిగా మోడి, ముఖ్యమంత్రిగా కె.సి.ఆర్ ఈ రోజు స్వాతంత్ర్య అమరోత్సవాలను ప్రారంభించ గలుగుతున్నారని మరువకూడదు. అక్కడ మోడి, ఇక్కడ కె.సి.ఆర్ సంబరాలు ఆరంబించడానికి ఆక్షేపణ లేదు. కాని వాస్తవాలను కప్పిపుచ్చే ప్రయత్నాలే భాదాకరము. మోడి లేనిదే భారత్ లేదు- కె.సి.ఆర్ లేనిదే తెలంగాణ లేదు అనే వితండ వాదనతో ప్రజలను మభ్య పెట్టే ప్రయత్నము జరుగుతుంది. నిజానికి కాంగ్రెస్ లేనిదే భారత్ కు స్వాతంత్ర్యము వచ్చేది కాదు.

కాంగ్రెస్, సొనియా లేనిదే తెలంగాణాకు ప్రత్యేక రాష్ట్రము వచ్చేది కాదు- ఇది చారిత్రాత్మక సత్యము. ఒప్పుకునే విశాల హృదయము అటు మోడి కి గాని ఇటు కె.సి.ఆర్ కు గాని లేదు. ఈ రోజు టి.అర్.ఎస్.పార్టీ ఓట్లు కోరుతూ పత్రికలకు ఇచ్చిన యాడ్ లో పి.వి. నరసింహారావు గారి ఫోటోను వేయడము, కె.సి.అర్ దిగజారుడు తనానికి నిదర్శనము. టి.అర్.ఎస్ కు , పి.వికి ఏమి సంబందము.? ఆయన కూతురు టి.అర్.ఎస్ అభ్యర్థి అయినంత మాత్రాన ఆయన ఆ పార్టీ వాడవుతాడా? ఆయనే బ్రతికివుంటే ఇందుకు అనుమతించే వాడా? పి.వి ఫోటో పెట్టుకునే అధికారము హక్కు కేవలము కాంగ్రెస్ కే.  వారి పిల్లలకు కూడా వారి ఫొటోను ఇతర పార్టీ లకు ఇచ్చే హక్కు అధికారము, హక్కు లేదు. సంతానానికి ఆస్తిలో వారసత్వపు హక్కు వస్తుందేమో కానీ, పూర్వీకుల రాజకీయ చరిత్రను , విలువలను తారుమారు చేసే అధికారము, హక్కు రాదు. పి.వి. కూతురుగా వాణి గారిని గౌరవిస్తాము, కాని ఆయన ఆత్మను ఈ విధముగా క్షోభ పెట్టడము సహించము. పి.వి ఒక కుమారుడు పి.వి.రంగారావు గతములో కాంగ్రెస్ శాసన సభ్యుడిగా, మంత్రిగా మరొక కుమారుడు శ్రీ పి.వి. రాజేశ్వర్ రావు సికిందరాబాద్ లోక్ సభ స్థానము నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచిన విషయాన్ని మరువకూడదు. పి.వి. నరసింహారావు తన యావత్ జీవితము కాంగ్రెస్ పార్టీ లోనే ఉండి, ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ లో అనేక పదవులతో పాటు ముఖ్యమంత్రి పదవి, జాతీయ స్థాయిలో కేంద్ర మంత్రిగా, ప్రదాన మంత్రిగా, అఖిల భారత కాంగ్రెస్ అధ్యక్షుడిగా సేవలనందించారు. ఇందిరాగాంధికి నమ్మినబంటుగా కీర్తి పొందిన నాయకుడు. పి.వి గారు తెలంగాణ ప్రజల ముద్దు బిడ్డ అయినా, తన జీవిత కాలములో ఎన్నడూ ప్రత్యేక రాష్ట్ర వాది కాదు. కె.సి.అర్ తన స్వార్థ రాజకీయాలకు పి.వి. కుటుంబాన్ని పావుగా వాడు కుంటున్నాడు.  దేశ స్వాతంత్ర్య సముపార్జనలో, తెలంగాణ రాష్త్ర ఆవిర్భావములో కాంగ్రెస్ పార్టీ పాత్రను గుర్తించి, నియంతృత్వ పోకడలను అరికట్టి, ప్రజాస్వామ్యాన్ని రక్షించడానికి గ్రాడ్యుయేట్ నియోజకవర్గ ఎన్నికలలో కాంగ్రెస్ అభ్యర్థులైన జి. చిన్నా రెడ్డి, రాములు నాయక్ ను గెలిపించాలి. పోలింగ్ ఏజెంట్ గ్రాడ్యుయేట్ కానక్కర్లేదు. గ్రాడ్యుయేట్ ఎన్నికల నిబంధనల ప్రకారము, అభ్యర్థి యొక్క పోలింగ్ ఏజెంట్ కానీ, కౌంటింగ్ ఏజెంట్ కానీ గ్రాడ్యుయేట్ కానక్కర్లేదు. ఆయా నియోజకవర్గవాసియై  ఉండాలి. ఈ విషయమై అక్కడక్కడ సందిగ్డాలు ఉన్నందున ప్రిసై డింగ్ అధికారులకు స్పష్టమైన ఆదేశాలివ్వమని రాష్ట్ర ఎన్నికల అధికారి శశాంక్ గోయల్ కి ఒక లేఖ రాయడమైనది. అని జి.నిరంజన్ పేర్కొన్నారు.

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: