నల్ల చట్టాలకు వ్యతిరేకంగా,,,
భారత్ బంద్
(జానోజాగో వెబ్ న్యూస్-నందికొట్కూరు ప్రతినిధి)
వ్యవసాయ కార్మిక ఉద్యోగ ప్రజావ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా శుక్రవారంనాడు కేంద్ర రాష్ట్ర రైతు కార్మిక సంఘాల పిలుపు మేరకు నందికొట్కూరు పట్టణమునందు సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ పార్టీ ఆధ్వర్యంలో బంద్ జరిగింది ఈ సందర్భంగా భారత కార్మిక సంఘాల సమాఖ్య ఐ ఎఫ్ టి యు జిల్లా కార్యదర్శి కె అరుణ్ కుమార్ మాట్లాడుతూ ఈ దేశంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అక్రమంగా మూడు వ్యవసాయ చట్టాలను తీసుకువచ్చి కార్పొరేట్ కంపెనీలకు అనుకూలంగా వ్యవహరిస్తున్నాయి మూడు వ్యవసాయ చట్టాల వలన వ్యవసాయ రంగానికి మరణశాసనం అయిందన్నారు అలాగే విశాఖ ఉక్కు పరిశ్రమ కోసం 32 మంది ప్రాణాలర్పించారు అరవై నాలుగు గ్రామాల ప్రజలు నిర్వాసితులయ్యారు నేడు మూడు లక్షల కోట్ల విలువ చేసే విశాఖ ఉక్కు పరిశ్రమను కేవలం 32 వేల కోట్లకు పోక్సో కంపెనీకి ఇవ్వటానికి ప్రయత్నిస్తుంది కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తూ రాష్ట్ర ప్రజల పైన కార్మికులపై పరోక్షంగా దాడి చేస్తున్నట్లే అన్నారు దేశ ప్రజలు కార్మికులు ఉద్యోగస్తులు మరోసారి జాతీయోద్యమాన్ని స్ఫూర్తిగా తీసుకొని పోరాటంలో పాల్గొన వలసిన అవసరం ఉందన్నారు.
అనంతరం అఖిలభారత రైతుకూలి సంఘం జిల్లా కోశాధికారి ఎం గోపాల్ మాట్లాడుతూ మోడీ హిందూ ఫాసిస్టు విధానాలను వేగవంతంగా అమలు చేస్తూ ప్రగతిశీల శక్తులపై తీవ్ర నిర్బంధాన్ని ప్రయోగిస్తున్నారు మరో ప్రక్క 35 ప్రభుత్వ రంగ సంస్థలను లాభనష్టాలు తో సంబంధం లేకుండా ప్రైవేటు వ్యక్తులకు అప్పగించడానికి సిద్ధం చేయడం దారుణమన్నారు అంతేగాక మూడు వ్యవసాయ చట్టాలను తీసుకు వచ్చి వ్యవసాయ రంగాన్ని సంక్షోభంలోకి నెట్టి ఉందన్నారు ఈ కార్యక్రమంలో పీ వై ఎల్ జిల్లా నాయకులు యూ నవీన్ కుమార్ ఫుట్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు పి తిక్కయ్య ఐ ఎఫ్ టి యు డివిజన్ అధ్యక్షుడు ఈ వెంకటేశ్వర గౌడ్ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు కే గోవిందు తిమ్మన్న ఏ ఐ కె ఎమ్ ఎస్ నాయకులు ఎల్ల నాయుడు పుల్లన్న ఆటో కార్మికులు రామకృష్ణ జీవన రవి శేఖర్ తదితరులు పాల్గొన్నారు.
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,
రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి
Post A Comment:
0 comments: