ఘనంగా ప్రపంచ జల దినోత్సవం

(జానోజాగో వెబ్ న్యూస్-కర్నూలు జిల్లా ప్రతినిధి)

ప్రకాశంజిల్లా తర్లుపాడు మండల పరిధిలోని తుమ్మల చెరువు గ్రామం నందు ప్రపంచ జల దినోత్సవం సందర్భంగా తుమ్మలచెరువు గ్రామ సర్పంచ్ షేక్ రసూల్ షాజహాన్ ఆధ్వర్యంలో సచివాలయం నుండి పురవీధుల్లో ఆర్ బి కే వరకు ర్యాలీ నిర్వహించడం జరిగింది.  ఆర్డబ్ల్యూఎస్  ఏ ఈ  డి. జ్యోతి సృజన గారు మాట్లాడుతూ నీటిని వృధా చేయకుండా ఆదా చేయాలని భావితరాలకు ఆదర్శంగా నిలవాలి అంటూ, నీటి ట్యాంకు లో బ్లీచింగ్ వేసి కడిగిన తర్వాత ఒకరోజు నీరు నిల్వ ఉండకుండాఉంచాలని క్రీములు ఏర్పడకుండా ఉంటాయని నీటిని ఒడిసి పట్టాలని, అవసరాలకు పరిమితం మాత్రమే నీటిని వినియోగించుకోవాలనిగఆమె అన్నారు. మండల ఏపీఓ   మహాలక్ష్మిగారు మాట్లాడుతూ
నీటి యొక్క ప్రాధాన్యత గురించి భావితరాలు ఏ విధంగా నీటిని ఒడిసి పట్టుకోవాలనే విషయాల గురించి క్లుప్తంగా వివరించారు. తుమ్మలచెరువు పంచాయితీ  పరిధిలోని ప్రతి  పౌరులు చెట్లను నాటి పర్యావరణాన్ని  రక్షించాలని ఉపాధి హామీ పని గురించి ఎవరైనా పని కి వెళ్లాలంటే తప్పనిసరిగా వ్యాక్సినేషన్ వేయించుకోవాలని అన్నారు అగ్రికల్చర్ సహాయకులు  భోపాల్ గారు మాట్లాడుతూ నీటిని వృధా చేయకుండా వేసవిలో జాగ్రత్తగా వాడుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏ ఈ  జ్యోతి సృజన గారు, గ్రామ కార్యదర్శి   బట్టు. శ్రీనివాసులు,   వీఆర్వో రమణారెడ్డి గారు, అగ్రికల్చర్ అసిస్టెంట్   బోపాల్ గారు, ఏ పీ ఓ మహాలక్ష్మి గారు, ఫిషరీస్ అసిస్టెంట్  జంకె. వెంకటరెడ్డి, పంచాయతీ వలెంటర్ల్లు, గ్రామ రైతులు మరియు, పరిశుద్ధ కార్మికులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
 ,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి 

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: