ఏం.పీ.జే.ఆధ్వర్యంలో...
బంద్ విజయవంతం
(జానోజాగో వెబ్ న్యూస్- ఖమ్మం ప్రతినిధి)
కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన రైతు వ్యతిరేక నల్ల చట్టాలను రద్దు చేయాలని కోరుతూ ఈరోజు ఖమ్మం నగర కేంద్రంలో మూమెంట్ ఫర్ పీస్ అండ్ జస్టిస్ (ఎమ్.పి.జె.) జిల్లా అధ్యక్షులు ఎస్.కే. ఖాసిమ్ గారి ఆధ్వర్యంలో ఎమ్.పి.జె నాయకులు బందు నిర్వహించారు.
దేశంలో రైతాంగం గత 6 నెలలుగా నల్ల చట్టాలపై పోరాటం చేస్తున్నా కూడా, నరేంద్ర మోడి ప్రభుత్వం కళ్ళు తెరవక పోవడం శోచనీయం. తెలంగాణ మూమెంట్ ఫర్ పీస్ అండ్ జస్టిస్, తెలంగాణ రాష్ట్ర శాఖ, రైతుల పక్షాన మద్దతు తెలుపుతూ, దేశవ్యాప్తంగా జరుగుతున్న భారత్ బంద్ లో, పాల్గొనాలని ఇచ్చిన పిలుపు మేరకు ఖమ్మం జిల్లా ఎం.పి.జె శ్రేణులు, ఈ రోజు జరిగిన భారత్ బందు లో భాగం పంచుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎం.పి.జె జిల్లా నాయకులు రఫీఖ్, సుజా, గఫార్, హకీం, మదార్, జహీర్ తదితరులు పాల్గొన్నారు.
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,
రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి
Post A Comment:
0 comments: