హిందూపురంలో భక్తులకు....

మజ్జిగ పంపిణీ కార్యక్రమం

(జానోజాగో వెబ్ న్యూస్-హిందూపురం ప్రతినిధి)

అనంతపురం జిల్లా హిందూపురం పట్టణంలోని బెంగళూర్ రోడ్డు ఇందిరానగర్ నుండి బయలు దేరి శ్రీ వల్లీ సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర రథోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి   వేలాది భక్తులు పాల్గొన్నారు. ఆటో సంజీవ మిత్రబృందం, దాతల సహకారంతో కుల మతాలకు వర్గ వర్ణాలకు అతీతంగా భక్తాదులకు మజ్జిగ పంపిణీ కార్యక్రమము నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో శాంతి సంఘం సభ్యులు పుర ప్రముఖులు లైఫ్ వరల్డ్ ఉదయ్ కుమార్. ముస్లిం నగారా టిప్పు సుల్తాన్ యునైటెడ్ ఫ్రంట్ అధ్యక్షులు ఉమర్ ఫారూఖ్ ఖాన్ ఆటో సంజీవ వారిమిత్ర బృందం .హాజీ సుబాహాన్.షబ్బీర్.డీ ఆర్జీ.సీనా.సుభాష్ గాంధీ.బాబా.తదితరులు పాల్గొని మజ్జిగ పంపిణీ కార్యక్రమము ఘనంగా నిర్వహించి మత సామరస్యాన్ని ఆచరణాత్మక రూపంలో చాటి చెప్పారు.


 
   ,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి 

 

 

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: