ప్రాణాలు పణంగా పెట్టి సంపాదించుకున్న చరిత్ర దానికుంది 

విశాఖ ఉక్కు తెలుగు ప్రజలకే సొంతం

పిసిసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ చింతల మోహన్ రావు

(జానోజాగో వెబ్ న్యూస్-కర్నూలు జిల్లా ప్రతినిధి)

ప్రజలు తమ ఆస్తి, పాస్తులు, ప్రాణాలు పణంగా పెట్టి తెచ్చుకున్న ఫ్యాక్టరీ విశాఖ ఉక్కు అని ఏపిసిసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్. చింతల మోహన్ రావు అన్నారు. శనివారంఏపీ భవన్ ముందు ఏపీసీసీ అధ్యక్షులు డాక్టర్ సాకే.శైలజానాథ్ ఆద్వర్యంలో విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణకు వ్యతరేకంగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కోపుల రాజు ఏఐసీసీ సెక్రెటరీ గిడుగు రుద్రరాజు, కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం నాయకులు, కార్యకర్తలు అభిమానులతో కలిసి డిల్లీలో ధర్నా నిర్వహించినట్లు తెలిపారు. ఈ సంధర్భంగా ఆయన మాట్లాడుతూ "విశాఖ ఉక్కుతో పాటు ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు" అని అన్నారు.

విశాఖ ఉక్కు అభివృద్ధి, పరిరక్షణ కూడా ప్రజల పోరాటాలతోనే కొసాగిందన్నారు. విశాఖ ఉక్కు రెండు తరాల రాష్ట్ర ప్రజానీకానికి  రాబోయే తరాలకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు చూపి ఆకలి తీర్చే కల్పతరువులా ఉందని అన్నారు. అందుకే విశాఖ ఉక్కు జోలికొస్తే ప్రజలు తరిమి తరిమి కొట్టడం ఖాయమని జోస్యం చెప్పారు. ప్రజాభిప్రాయాన్ని సేకరించకుండా ప్రైవేటీకరణకు తెగబడడం ఈ ఏకపక్ష, నిరంకుశ వైఖరినే బిజెపి నాయకులు తమ సమర్థతకు చిహ్నంగా భావిస్తే తెలుగు ప్రజలు తిప్పికొట్టడం ఖాయం! 1962లో ఉక్కు ఫ్యాక్టరీ స్థాపనకు హామీ ఇచ్చి ఆ తరువాత మొండిచెయ్యి చూపితే ఉవ్వెత్తున ఎగిసిన తెలుగు ప్రజలు ప్లాంటును సాధించుకున్నారు. నాటి పోరాటంలో 32 మంది అమరులవడంతో నాటి ప్రధాని దిగివచ్చి ఫ్యాక్టరీకి శంకుస్థాపన చేయక తప్పలేదు. ప్రజలు ఎన్నుకున్న ముఖ్యమంత్రి ఎన్‌టిఆర్‌ను 1984లో పదవీచ్యుతుడిని చేసినప్పడు ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం తిరగబడి సాధించుకున్న ఘనత ఇక్కడి ప్రజలదన్నారు. తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని సవాల్‌ చేసిన ప్రతిసారీ కేంద్ర ప్రభుత్వానికి తలనొప్పిగా మారిందన్నారు. విశాఖ ఉక్కును తెగనమ్మే ప్రక్రియలో చర్చించాల్సిన అవసరం లేదంటూ పూచికపుల్లకన్నా హీనంగా తీసిపారేసిందని ఇది తగదన్నారు. తమ కార్పొరేట్‌ ప్రభువుల కోర్కెలను తీర్చే పనిలో వారు నిమగ్నమైనారని, అధికార అహంకారంతో మూసుకుపోయిన వారి కళ్లు, చెవులను తెరిపించాలంటే సమైక్య పోరాటమే మార్గమన్నారు. ఈ దిశలో ఇప్పటికే కార్మికలోకం కార్యాచరణను చేపట్టిందని, దానికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాల మద్దతు ఇవ్వాలన్నారు. ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ కూడా కలిసిరావాలని, పొరుగున ఉన్న తెలంగాణ ప్రభుత్వం సైతం మనకు మద్దతుగా నిలబడుతోందన్నారు. కానీ, రాష్ట్రంలోని రెండు ప్రధాన పార్టీలు సుందోపసుందుల్లా కాట్లాడుకుంటూ విశాఖ ఉక్కు పరిరక్షణకు రెండో ప్రాధాన్యతనే ఇస్తున్నాయి. ఇక జనసేన ఇప్పటికైనా బిజెపి బంధాన్ని తెగ్గొట్టుకుని ఉక్కు ఉద్యమంలో భాగం కావాలి. ఈ మూడు పార్టీలు కార్మికులకు అండదండగా ఇప్పటికే నిలిచిఉన్న వామపక్షాలతో కలిసి పోరాటంలోకి రావాలి. తమతో ఉన్న సమస్త శక్తులను కార్మికుల వెనుక మోహరింపచేయాలన్నారు.


Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: