'వెన్ లైఫ్ సైన్సెస్' కు ప్రతిష్టాత్మక

టైమ్స్ అఫ్ ఇండియా అవార్డు

(జానోజాగో వెబ్ న్యూస్ -విజయవాడ ప్రతినిధి)

ఫార్మారంగంలో హైదరాబాద్ కు చెందిన 'వెన్ లైఫ్ సైన్సెస్' విజయాల పరంపర కొనసాగుతోంది. తాజాగా టైమ్స్ అఫ్ ఇండియా గ్రూప్.. ఈటీ  బిజినెస్ ఎక్సలెన్స్ అవార్డుతో మరోసారి ప్రజల దృష్టిని ఆకర్షించింది. ఫార్మాస్యూటికల్ & న్యూట్రాస్యూటికల్ కేటగిరీ కింద, ఔషధ రంగంలో సంస్థ చేసిన అద్భుతమైన కృషికి ఈ అరుదైన గౌరవం దక్కింది. హైదరాబాద్ లోని నోవాటెల్ హెచ్‌ఐసిసిలో జరిగిన కార్యక్రమంలో అవార్డు ప్రధానం జరిగింది. తెలంగాణ హోంమంత్రి మొహమ్మద్ అలీ చేతులమీదుగా సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ ఏలూరి రామచంద్రారెడ్డి ఈ సత్కారాన్ని స్వీకరించారు.

 

ఈ సందర్బంగా కార్యక్రమానికి విచ్చేసిన అతిరధమహారధులు డాక్టర్ ఏలూరికి శుభాకాంక్షలు తెలిపారు.  ఔషధ రంగంలో  'వెన్ లైఫ్ సైన్సెస్' కృషి అభినందనీయమని అన్నారు.. కరోనా సమయంలో ఈ సంస్థ అధినేత దాదాపు రూ. కోటి రూపాయల శానిటైజర్ పంపిణితో మూడు రాష్ట్రాల హృదయాల్లో నిలిచారని.. ఇంట్లో ఉంటూ ప్రాణాలతో పోరాడుతున్న ఆ సమయంలో డాక్టర్ ఏలూరి స్వయంగా ఊరూరా తిరిగి హ్యాండ్ శానిటైజర్ వితరణ చేయడం గొప్ప విషయం అని కొనియాడారు. ఫార్మారంగంలో ఆయన చేసిన కృషి  తోపాటు పేదలకు చేసిన సహాయసహకారాలను ఈటీ సంస్థ గుర్తించడం కూడా చాలా గొప్ప విషయం అన్నారు. ఇదిలావుంటే బిజినెస్ ఎక్సలెన్స్ అవార్డును తమ సంస్థ అందుకోవడం పట్ల డాక్టర్ ఏలూరి సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్బంగా ఉద్యోగులు, శ్రేయోభిలాషులు, స్నేహితులు, సహచరులు మరియు మద్దతుదారులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారాయన.

 ,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి 

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: