రసవత్తరంగా సాగుతున్న,,,
బేస్ బాల్ క్రిడాపోటీలు
క్రీడాకారులను పరిచయం చేసుకుంటున్న ఎమ్మెల్యే శిల్పా రవి
(జానోజాగో వెబ్ న్యూస్-కర్నూలు జిల్లా ప్రతినిధి)
జాతీయ బేస్ బాల్ ఫెడరేషన్ అధ్యక్షులు, ఐపిఎస్ కృష్ణమూర్తి, జాతీయ కార్యదర్శి హరీష్ భరద్వాజ్ ఆధ్వర్యంలో బేస్ బాల్ క్రిడాపోటీలు రసవత్తరంగా సాగుతున్నాయి. బుధవారం 2వ రోజు వివిధ జట్లు పోటీపడ్డాయి. హర్యానా, పంజాబ్, ఢిల్లీ, రాజస్థాన్, తెలంగాణ, ఆంధ్ర జట్లు తలపడ్డాయి. 34వ జాతీయ సీనియర్ బేస్ బాల్ ఛాంపియన్ షిప్ పోటీల్లో వివిధ రాష్ట్రాలకు చెందిన క్రీడాకారులు పాల్గొన్నారు. నంద్యాల ఎమ్మెల్యే శిల్పా రవి చంద్ర కిషోర్ రెడ్డి క్రీడాకారులను పరిచయం చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆర్గనైజింగ్ కమిటీ చైర్మన్ నంద్యాల శాసనసభ్యులు శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి మల్లికార్జున రెడ్డి, సీఈవో మాధవరావు, జిల్లా ఒలింపిక్ చైర్మన్ డాక్టర్ రవికృష్ణ, ఆర్గనైజింగ్ కమిటీ కన్వీనర్ బాచం జగదీశ్వర్రెడ్డి, జిల్లా సంఘం అధ్యక్ష, కార్యదర్శులు రమణ, సుబ్బయ్య, పిచ్చిరెడ్డి, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్బంగా ఎమ్మెల్యే శిల్పా రవి మాట్లాడుతూ వివిధ రాష్టాలకు చెందిన క్రీడాకారులకు నంద్యాల వేదిక కావడం గర్వకారణమన్నారు. నంద్యాలలో జాతీయ స్థాయి క్రీడలు నిర్వహించడం అభినందనియమని, తమ వంతు సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు. ఫెడరేషన్ ప్రధాన కార్యదర్శి మల్లికార్జున రెడ్డి మాట్లాడుతూ ఇక్కడ ఆడినటువంటి క్రీడాకారుల నుండి ఎంపిక చేసిన వారిని మహిళలను హాంకాంగ్ ఆడేందుకు, పురుషులను పారిస్ పంపెందుకు నిర్ణయిస్తామని పేర్కొన్నారు.
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,
రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి
Post A Comment:
0 comments: