అంగరంగ వైభవంగా ప్రారంభమైన 

జాతీయ బేస్ బాల్ క్రిడాపోటీలు 

ముఖ్య అతిథులుగా పాల్గొన్న ఎమ్మెల్యే శిల్పా రవి 

(జానోజాగో వెబ్ న్యూస్-కర్నూలు జిల్లా ప్రతినిధి)

కర్నూల్ జిల్లా నంద్యాల పట్టణంలో మంగళవారం జాతీయ స్థాయి బేస్ బాల్ క్రిడాపోటీలను నంద్యాల ఎమ్మెల్యే శిల్పా రవి చంద్ర కిషోర్ రెడ్డి ప్రారంభించారు. జాతీయ బేస్ బాల్ ఫెడరేషన్ అధ్యక్షులు, ఐపిఎస్ కృష్ణమూర్తి, జాతీయ కార్యదర్శి హరీష్ భరద్వాజ్ ముఖ్య అతిథులుగా ఆర్గనైజింగ్ కమిటీ చైర్మన్ నంద్యాల శాసనసభ్యులు శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి, రాష్ట్ర అసోసియేషన్ గౌరవాధ్యక్షురాలు నాగినిరెడ్డి, ప్రధాన కార్యదర్శి మల్లికార్జున రెడ్డి, సీఈవో మాధవరావు, జిల్లా ఒలింపిక్ చైర్మన్ డాక్టర్ రవికృష్ణ, ఆర్గనైజింగ్ కమిటీ కన్వీనర్ బాచం జగదీశ్వర్రెడ్డి, జిల్లా సంఘం అధ్యక్ష, కార్యదర్శులు రమణ, సుబ్బయ్య,  బాల్ బ్యాట్మెంటన్ రాష్ట్ర సంఘం చీఫ్ ప్యాట్రన్ చిన్నపరెడ్డి, నంది డైరీ చైర్మన్ రామలింగారెడ్డి, నంద్యాల పురపాలక అధ్యక్షురాలు షేక్ మాబున్నీసా, డి.ఎస్.పి చిదానంద రెడ్డి, కమిషనర్ వెంకట కృష్ణుడు,  మార్కెట్ యార్డ్ చైర్మన్ ఇసాక్ భాష, మున్సిపల్ వైస్ చైర్మన్ శ్రీధర్, లయన్స్ క్లబ్ అధ్యక్షులు మనోహర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఎమ్మెల్యే శిల్పా రవి జాతీయ పతాకాన్ని,  జాతీయ సంఘం క్రీడా పతాకాన్ని జాతీయ కార్యదర్శి హరీష్ భరద్వాజ్, ఫెడరేషన్ అధ్యక్షురాలు శిల్పా నాగినిరెడ్డి రాష్ట్ర సంఘం పతాకాన్ని ఆవిష్కరించారు. ఆర్గనైజింగ్ కమిటీ చైర్మన్ నంద్యాల శాసనసభ్యులు శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి మాట్లాడుతూ నంద్యాల లాంటి చిన్న పట్టణంలో జాతీయ స్థాయి క్రీడలు నిర్వహించడం అభినందనియమని, ఎలాంటి సహాయ సహకారాలు కావాలన్నా అందించేందుకు తాము సిద్ధంగా ఉన్నామన్నారు. బేస్ బాల్ క్రీడాకారుల కొరకు స్టేడియం నిర్మించేందుకు కృషి చేస్తామన్నారు. క్రీడాకారులు గెలుపు ఓటములను సమానంగా స్వీకరించాలన్నారు. ఫెడరేషన్ అధ్యక్షులు కృష్ణమూర్తి, జాతీయ కార్యదర్శి హరీష్ భరద్వాజ్, రాష్ట్ర సంఘం ప్రధాన కార్యదర్శి తదితరులు ప్రసంగించారు.
గురురాజా స్కూల్ చిన్నారుల శాస్త్రీయ నృత్య ప్రదర్శన, యోగా ప్రదర్శన ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది,  ఎమ్మెల్యే క్రీడలను ప్రారంభిస్తున్నట్లు ప్రకటిస్తూ క్రీడా జ్యోతిని వెలిగించి రాష్ట్ర క్రీడాకారిణికి అందించారు. ఈ సందర్భంగా అతిథులు పావురాలు  విడుదల చేశారు. కర్నూలు ఆర్మ్డ్ రిజర్వ్ పోలీసులు స్పెషల్ బ్యాండ్ ను అనుసరిస్తూ వివిధ రాష్ట్రాల క్రీడాకారుల జట్టు మార్చ్ ఫాస్ట్ లో పాల్గొన్నారు. తదుపరి తెలంగాణ ఉత్తర ప్రదేశ్ జట్ల మధ్య ప్రారంభ మ్యాచ్ ను ఎమ్మెల్యే శిల్పా రవి,  గౌరవాధ్యక్షురాలు శిల్పా నాగిని రెడ్డిలు క్రీడాకారులను పరిచయం చేసుకుని క్రీడలను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో గురురాజా విద్యాసంస్థల డైరెక్టర్ షావలి రెడ్డి, ఎస్విఆర్ విద్యాసంస్థల చైర్మన్ వెంకటరామిరెడ్డి, వైకాపా నాయకులు, మునిసిపల్ కౌన్సిలర్లు,  పుర ప్రముఖులు తదితరులు పాల్గొన్నారు. ,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి 

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: