కన్నెత్తి చూసిందెక్కడా...?

పంట పొలాలకు లేఅవుట్లువేసి ప్లాట్లుగా మార్పు

పట్టించుకొని అధికార యంత్రాంగం


(జానోజాగో వెబ్ న్యూస్-తర్లుపాడు ప్రతినిధి)

ప్రకాశంజిల్లా తర్లుపాడు మండలం లోని  తర్లుపాడు, శీతా నాగులవరం, ఉమ్మారెడ్డిపల్లి , కలుజువ్వలపాడు లోని ప్లాట్లుగా మారుతున్న పొలాలు, యథేచ్ఛగా రియల్ వ్యాపారం, మోసపోతున్న కొనుగోలుదారులు, చోద్యం చూస్తున్న అధికారులు రియల్ మాయాజాలానికి అమాయకులు బలవుతున్నారు. మాటలతో బురిడీ కొట్టి సొమ్ము చేసుకుంటున్నారు. ప్రభుత్వం నుంచి ఎలాంటి అనుమతులు లేకుండా పచ్చని వ్యవసాయ భూమిలో  వెంచర్లు  గా మారుస్తున్న రియల్టర్లు వాటిని ప్లాట్లుగా ప్రజలకు విక్రయిస్తున్నారు. లే అవుట్ లు గా మార్చి విక్రయిస్తున్నారు. అనుమతి లేదన్న విషయం కొనుగోలుదారులకు తెలియక మోసపోతున్నారు.
అక్రమంగా వెంచర్లు గా వేసి అధికారులకు తెలిసినప్పటికీ పట్టించుకోకపోవడంతో అధికారులు మీనా వేషాలు , లెక్కపెడుతూ ఉండడం అనేది రియల్ వ్యాపారస్తుల నుండి పెద్ద మోతాదులో ముడుపులు ముట్టినట్లు అన్నట్లుగా ఉందని పలువురు వాపోతున్నారు. తర్లుపాడు లో ఎకరా రూ 30 లక్షలు, శీతానాగులవరం లో రూ50 లక్షలు, కలుజువ్వలపాడు జాతీయ రహదారి పక్కన రూ 50 లక్షలు కు కొనుగోలు చేసి వాటిని రూ కోటి  45 లక్షలు విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారు. ప్రభుత్వ భూముల్లో ప్లాట్లు వేసి విక్రయించాలంటే దానిని ప్రభుత్వ అనుమతితో కన్వర్షన్ చేయాల్సి ఉంటుంది. ప్రభుత్వానికి నిర్దేశిత ఫీజులు చెల్లించాలి. నిబంధనల ప్రకారం ఎకరా భూమిలో శాతం 40 శాతం భూమిని రహదారులు, బడి, గుడి, సైడ్ కాలువలకు పార్కులు లాంటి వసతులకు భూమిని కేటాయించాల్సి ఉంది. ప్రభుత్వానికి ఎలాంటి ఫీజు చెల్లించకుండా అధికారులకు మామూలు ఇచ్చి ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి అక్రమాలను అడ్డుకోవాలని స్థానికంగా డిమాండ్ వస్తోంది. ,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి 

 

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: