వైసీపీ నేత డాక్టర్ రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో

ఘనంగా వైసీపీ దశాబ్ది ఉత్సవాలు

(జానోజాగో వెబ్ న్యూస్-హైదరాబాద్ బ్యూరో)

 తెలుగు రాష్ట్రాల ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన మహానేత డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి అని, అ మహనీయుని పేరుతో ఆవిర్భావించిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ 10 సంవత్సరాలు పూర్తి చేసుకోవడం హర్షణీయమని  రాష్ట్ర వైసీపీ నేత డాక్టర్ ఏలూరి రామచంద్రారెడ్డి అన్నారు. పార్టీ దశాబ్ద కాలం పూర్తి చేసుకున్న సందర్భంగా ఆవిర్భావ దినోత్సవ వేడుకలు నేడు హైదరాబాద్ లో డాక్టర్ ఏలూరి ఆధ్వర్యంలో  ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఆయన తన అనుచరులతో కలిసి స్వర్గీయ వైఎస్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం కేక్ కట్ చేసి స్వీట్స్ ను పంపిణీ చేయడం జరిగిందని అన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ ఏలూరి మాట్లాడుతూ టీడీపీ హయాంలో ఎపి అస్తవ్యస్తం అయిందని, అలాంటి పరిస్థితుల్లో  ప్రజల ప్రయోజనాలను కాపాడేందుకు జగన్ నాయకత్వం లో  వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని స్థాపించడం జరిగిందని అన్నారు. అయితే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని అణగదొక్కేందుకు చంద్రబాబు అనేక కుట్రలు, కుతంత్రాలు పన్నారని అయితే రాష్ట్ర ప్రజల ఆదరాభిమానాలు, ఆప్యాయలు జగన్ కు సంపూర్ణంగా ఉండడంతో అ ఆటలు సాగాలేదని ఆయన గుర్తు చేశారు. ఈ రోజు దేశంలోనే అత్యంత శక్తివంతమైన రాజకీయ పార్టీగా ఎదగుతూ మరోవైపు ప్రజల విశ్వాసాన్ని పెంపొందించుకుంటు దేశ ప్రజల దృష్టిని ఆకర్షిస్తున్న పార్టీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అని డాక్టర్ ఏలూరి అన్నారు. ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను కేవలం 18 మాసాలలోనే అమలుపరచిన ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అని అన్నారు. వైసీపీ పార్టీని మరింత బలోపితం చేసేందుకు జగన్ నాయత్వంలో ప్రతి కార్యకర్త ఒక క్రమశిక్షణ కలిగిన సైనికుడిగా కృషి చేయాలని రాష్ట్ర వైసీపీ నేత డాక్టర్ ఏలూరి రామచంద్రారెడ్డి పిలుపునిచ్చారు.

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: