తర్లుపాడులో..

ఉచిత పశు వైద్య శిబిరం

(జానోజాగో వెబ్ న్యూస్-తర్లుపాడు ప్రతినిధి)

       తర్లుపాడు మండలం గొల్లపల్లి గ్రామంలో జాతీయ ఉచిత పశు కృత్రిమ గర్భధారణ పథకం -2 ఈ కార్యక్రమంలో భాగంగా ఉచిత పశు వైద్య శిబిరాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమం లో ఎదకు వచ్చిన గేదెలకు ఉచితంగా కృత్రిమ గర్భధారణ(ఏ-1) చేయడం జరిగింది. ఎదకు రానీ గేదెలకు తిరిగి పొర్లే గేదెలకు గర్భకోశ వ్యాధులకు  చికిత్స చేయడం జరిగింది.
పశువులలో చుడి నిర్ధారణ పరీక్షలు మరియు చూడి పశువులు సంరక్షణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించడం జరిగింది. దూడలకు నట్టల నివారణ మందులు తాపించడం జరిగింది. ఈ కార్యక్రమంలో డాక్టర్ బి.మహేశ్వర్ రెడ్డి  డి డి( ఏ హెచ్), డాక్టర్ బి. చిన్న బాలు నాయక్  ఏడి( ఏ వి హెచ్), డాక్టర్.డి. విష్ణువర్ధన్ రెడ్డి  వి ఏ ఎస్, వీ డి, మరియు మాజీ సర్పంచ్ యక్కంటి. రామిరెడ్డి, పశుసంవర్ధక శాఖ సిబ్బంది, గ్రామ రైతులు పాల్గొన్నారు.

  ,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి 

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: