జెయింట్ సెక్రటరీగా లక్ష్మణ్ గంగా ఏకగ్రీవం

నాంపల్లి క్రిమినల్ కోర్టు ఎన్నికల్లో ఇదే తొలిసారి

(జానోజాగో వెబ్ న్యూస్-లీగల్ ప్రతినిధి)

ఈనెల 26 వ తేదీన జరగబోయే నాంపల్లి క్రిమినల్ కోర్టు బార్ అసోసియేషన్ ఎన్నికల్లో భాగంగా చరిత్రలో తొలిసారిగా జెయింట్ సెక్రటరీగా లక్ష్మణ్ గంగా ఏకగ్రీవం కావడం జరిగింది. ప్రత్యర్థిగా ఉన్న అభ్యర్థి తన నామినేషన్ ను ఉపసంహరించుకోవడంతో ఏకగ్రీవం తప్పనిసరి అయింది. దీంతో న్యాయవాద మిత్రులందరూ శుభాకాంక్షలు తెలిపారు. స్వీట్లు పంపిణీ చేసి పూల మాలలతో సత్కరించారు. ఆసియాలోనే అతిపెద్ద క్రిమినల్ కోర్టుగా పేరుగాంచింది. ఇప్పటివరకు ఏకగ్రీవం కావడం ఇదే తొలిసారి. మిగిలిన పోస్టులకు పోలింగ్ కొనసాగుతోంది. అభినందించిన వారిలో మామిడాల రమేష్, శ్రావణ్, తదితరులు పాల్గొన్నారు. 


 

✍️ రిపోర్టింగ్-డి.అనంతరఘు

న్యాయవాది. నాంపల్లి కోర్టు

,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి 

  

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: