టెంప్టేషన్

పింక్ టాల్క్ ప్రచారం కోసం సీక్రెట్ టెంప్టేషన్‌తో...

భాగస్వామిగా మారిన అమీరా దస్తర్

(జానోజాగో వెబ్ న్యూస్-బిజినెస్ బ్యూరో) 

పింక్ ద్వారా, సీక్రెట్ టెంప్టేషన్ 2 సంవత్సరాల తర్వాత తన ఉత్పత్తులకు ఒక ఆసక్తికరమైన కొత్త శ్రేణిని జోడించడమే కాకుండా, మునుపెన్నడూ లేని విధంగా మొట్టమొదటి సారిగా ఒక సంపూర్ణమైన ఉత్పత్తుల శ్రేణిని విజయవంతంగా ప్రవేశపెట్టింది

●       ‘పింక్ ఈజ్ ద న్యూ సీక్రెట్’ అనే ఉపశీర్షిక కలిగిన ఈ ఉత్పత్తులు డియోడరెంట్, టాల్కమ్ పౌడర్ మరియు సోప్‌లను కలిగి ఉంటాయి, అలాగే ఇవి భారతదేశమంతటా లభిస్తాయి

●       సీక్రెట్ టెంప్టేషన్ ద్వారా కొత్తగా ప్రవేశపెట్టబడిన ‘పింక్’ ఉత్పత్తులకు చెందిన టాల్కమ్ పౌడర్ ప్రచారాన్ని బాలీవుడ్ తారామణి అమీరా దస్తర్ చేయనున్నారు

మెక్‌ఎన్రో సంస్థకు చెందిన, మహిళల సుగంధ ఉత్పతుల్లో అగ్రగామి అయిన సీక్రెట్ టెంప్టేషన్, డియోడరెంట్, టాల్కమ్ పౌడర్ అలాగే సోప్‌లను కలిగిన ‘పింక్’ అనే సరికొత్త ఉత్పత్తుల శ్రేణిని ప్రవేశపెట్టింది. “పింక్ ఈజ్ ద న్యూ సీక్రెట్” అనే వాక్యం ద్వారా ఆత్మవిశ్వాసాన్ని ప్రకటిస్తూ, ఈ బ్రాండ్, యువతులు తమ అసమానమైన ఆత్మవిశ్వాసంతో ఈ ప్రపంచాన్ని శాసిస్తారని, తమను అందంగా అలంకరించుకుని, తమ కలలను సాకారం చేసుకుంటారని నమ్ముతోంది.

పింక్ సుగంధ ద్రవ్యం గాఢమైనది, అదే సమయంలో సున్నితమైనది కూడా - ఘనమైన కోకా మరియు వెనీలాతో సమ్మిళితమైన వైట్ ఫ్లోరాల తాజాదనం దీన్ని ఎంతో ఆకర్షణీయంగా అలాగే శక్తివంతంగా చేస్తుంది. పింక్ ద్వారా, సీక్రెట్ టెంప్టేషన్ 2 సంవత్సరాల తర్వాత తన ఉత్పత్తులకు ఒక ఆసక్తికరమైన కొత్త శ్రేణిని జోడించడమే కాకుండా, మునుపెన్నడూ లేని విధంగా మొట్టమొదటి సారిగా ఒక సంపూర్ణమైన ఉత్పత్తుల శ్రేణిని (సోప్ ఇంకా బ్యూటీ టాల్క్‌తో కలిపి) విజయవంతంగా ప్రవేశపెట్టింది.

ఈ సందర్భంగా మెక్ఎన్రో కన్స్యూమర్స్ ప్రోడక్ట్ ప్రైవేట్ లిమిటెడ్ యొక్క బిజినెస్ హెడ్, అంకిత్ దాగా గారు మాట్లాడుతూ,”పింక్‌ను కేవలం ఒక రంగులా మాత్రమే కాకుండా దాన్ని ఒక వ్యక్తిత్వంగా భావించే మన యువ మహిళా వినియోగదారులను ఆనందింపజేయడానికి, సంపూర్ణ ఉత్పత్తుల శ్రేణి అయిన పింక్‌ను అందించడం నాకు ఎంతో సంతోషంగా ఉంది. సరికొత్త పుష్పాలన్నిటి నుండి తయారైన, సుదీర్ఘ కాలం పాటు సువాసనలు వెదజల్లే, సీక్రెట్ టెంప్టేషన్ వారి పింక్ సుగంధ ద్రవ్యం, మహిళా లోకం యొక్క నిరంతర స్ఫూర్తికి వందనం చేస్తూ, ఈ ప్రపంచాన్ని అత్యంత ఆత్మవిశ్వాసంతో ఎదురుకోవడానికి సిద్ధంగా ఉన్న వారిని అభినందిస్తోంది” అన్నారు. 

సీక్రెట్ టెంప్టేషన్ వారి పింక్ టాల్కమ్ పౌడర్‌ను సమర్పిస్తున్న భారతీయ నటీమణి అమీరా దస్తర్, ఈ బ్రాండ్‌లో అలాగే కొత్త ఉత్పత్తుల ప్రారంభంలో తను కూడా ఒక భాగంగా మారడం సంతషంగా ఉందని అన్నారు. “సీక్రెట్ టెంప్టేషన్ కుటుంబంలో సభ్యురాలిగా మారడం నాకు చాలా ఆనందంగా ఉంది. వారి ఉత్పత్తులంటే నాకు విపరీతమైన ఇష్టం, అలాగే నేను వాటిని స్కూల్‌కు వెళ్లే రోజుల నుండి వాడుతున్నాను. నేను అనేక రకాల ఆటలు ఆడేదాన్ని కనుక నాకు వారి సోపులు, ముఖ్యంగా వారి పౌడర్లను వాడటం ఎంతో ఇష్టం. పింక్ నాకు ఎంతగానో నచ్చే రంగు; ప్రతి ఉత్పత్తిని వారు ఒక అద్భుతమైన కొత్త సుగంధంతో కలిపి ఒక కొత్త శ్రేణిని ప్రారంభించడం నాకు ఎంతో నచ్చింది,” అని పింక్ టాల్క్ యొక్క ప్రచారకర్తగా మారిన అమీరా అన్నారు. గతంలో కూడా ఈ బాలీవుడ్ తారామణి అనేక సౌందర్య మరియు చర్మసంరక్షణ ఉత్పత్తుల బ్రాండ్‌లకు ప్రచారకర్తగా ఉన్నారు.

150 మిలీ. డియోడరెంట్ ధర కేవలం రూ. 190 మాత్రమే. సీక్రెట్ టెంప్టేషన్ వారి పింక్ టాల్కమ్ పౌడర్, నాలుగు విభిన్న పరిమాణాల్లో అందుబాటులో ఉంది -- 25 గ్రాములు రూ. 10కి, 50 గ్రాములు రూ. 43కి, 100 గ్రాములు రూ. 80కి అలాగే 300 గ్రాములు రూ. 180కి. పింక్ సోపులు రెండు ప్యాక్‌లలో అందుబాటులో ఉన్నాయి -- 40 గ్రాములు రూ. 10కి అలాగే 75 గ్రాములు రూ. 30కి. పింక్ ఉత్పత్తులు దేశమంతటా అందుబాటులో ఉంటాయి, అలాగే వీటిని ప్రముఖ రీటెయిల్ దుకాణాలన్నిటిలో ఇంకా ప్రముఖ ఈ-కామర్స్ సైట్లు అయిన అమెజాన్, ఫ్లిప్కార్ట్, స్నాప్‌డీల్ ఇంకా పేటీఎమ్‌లలో కొనుగోలు చేయవచ్చు.


,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి 

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: