వారం రోజుల్లో పూర్తి చేసి అప్పగించాలి 

ఎయిర్ పోర్ట్ డైరెక్టర్ కైలాష్ మండల్ ను ఆదేశించిన జిల్లా కలెక్టర్ జి.వీరపాండియన్ 


(జానోజాగో వెబ్ న్యూస్-కర్నూలు జిల్లా ప్రతినిధి)

ఓర్వల్ విమానాశ్రయంలో ప్యాసింజర్ టెర్మినల్, ఎలక్ట్రికల్ సబ్ స్టేషన్, పంప్ హౌస్లో వున్న చిన్న చిన్న పెండింగ్ పనులను వారం రోజుల్లో పూర్తి చేసి అప్పగించాలని ఎయిర్ పోర్ట్ డైరెక్టర్ కైలాష్ మండల్ ను జిల్లా కలెక్టర్ జి.వీరపాండియన్ ను ఆదేశించారు. మంగళవారం సాయంత్రం జిల్లా ఎస్పీ కె.ఫకిరప్ప, జాయింట్ కలెక్టర్ రామసుందర్ రెడ్డిలతో కలిసి ఓర్వల్ విమానాశ్రయంలో జరుగుతున్న పనులను కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జి.వీరపాండియన్ మాట్లాడుతూ ఈ నెల 28వ తేదీ నుండి విమాన రాకపోకలు ప్రారంభమవుతున్న సందర్భంగా పెండింగ్లో ఉన్న చిన్న చిన్న పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని ప్యాకేజీ-2 కాంట్రాక్టర్ శశిధర్ రెడ్డిని సూచించారు. పోలీసు సెక్యురిటి బ్యారక్ నిర్మాణంలో పెండింగులో వున్న పనులను 10 రోజుల్లో పూర్తి చేయాలని సంబంధిత కాంట్రాక్టర్ సి. వి. నారాయణ రెడ్డిని ఆదేశించారు.
పోలీస్ సెక్యూరిటీ బ్యారక్ నిర్మాణ పనులను వేగవంతం చేసేందుకు మ్యాన్ పవర్ పెంచుకొని పనులు వేగవంతం చేయాలన్నారు. అదేవిధంగా విమానాశ్రయంలో ప్రయాణికులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు పక్కా ప్రణాళికతో పకడ్బందీగా అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని ఎయిర్ పోర్ట్ డైరెక్టర్ కైలాష్ మండల్ ను ఆదేశించారు. కలెక్టర్ వెంట కర్నూల్ ఆర్డిఓ వెంకటేశులు, డిఆర్డిఎ ప్రాజెక్టు శ్రీనివాసులు, ఓర్వకల్లు తాసిల్దార్ శివ రాముడు, ఇంజనీరింగ్ సిబ్బంది, అధికారులు తదితరులు పాల్గొన్నారు.

 ,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి 

 

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: