తొలి ప్రధాన్యత ఓటుతోనే గెలుపు సాధ్యంకాదు

ఇలా ఓటేస్తేనే ఎమ్మెల్సీ అభ్యర్థి గెలుపు

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల ఓటింగ్ మార్చి 14 ఆదివారం నాడు జరగనున్నది. ఈ నేపథ్యంలో ఓటు వేసే విధానం ఒక్కసారి చూద్దాం. పోలింగ్ బూత్ కు మన ఓటర్ స్లిప్, ఏదైనా ఒక ఐడి కార్డు మనది తీసుకొని వెళ్ళాలి. ఈ ఎన్నికల్లో ఈవీఎంల వాడకం అన్నది ఉండదు. కేవలం బ్యాలెట్ పేపర్ మాత్రమే ఉంటుంది. పోలింగ్ అధికారి మీకు బ్యాలెట్ పేపర్,పెన్ను వారిదే ఇస్తారు. వారు ఇచ్చే పెన్నుతో మాత్రమే ఓటు వేయాలి

మొదటి ప్రాధాన్యత ఓటుతోనే గెలుపు సాధ్యంకాదు...

ఒక ఉదాహరణ:

మొత్తం పోల్ :50

అంటే  26ఓట్లు వచ్చిన వారు గెలుపు. 

అభ్యర్థి A కు మొదటి ప్రాధాన్యత ఓట్లు 23. 

Bకు  17.

C కు10 ఓట్లు వచ్చాయి.

కాని  Aకు మెజారిటీ ఓట్లు వచ్చాయి కాని గెలవలేదు.

గెలుపు కు దగ్గరగా వచ్చాడు.

ఇప్పుడు రెండవ కౌంటింగ్ ఉంటుంది.

ఓట్లు ప్రకారం అభ్యర్థి C. ఎలిమినేషన్ అవుతారు.

కాని అతని కి పడిన ఓట్లు సజీవంగా ఉంటాయి.

ఇప్పుడు  C  కి పడిన బ్యాలెట్ లోని సెకండ్ ఓట్లు కౌంటింగ్ చేస్తారు.

అందులో A  కు 1 ఓటు, B కు   9 vote లు వచ్చాయి. దానితో A  votes 23+1=24

B votes 17+9=26

అవుతాయి. B  గెలిచాడు .

దీని వలన తెలిసింది ఏమిటంటే గెలుపులో కేవలం మొదటి ప్రాధాన్యత ఓట్లు మాత్రమే సరిపోవు. ప్రధాన పాత్ర మిగతా 2 ,3, .....  కౌంటింగ్ లదే. కాబట్టి మీకు నచ్చిన వారి కి మొదటి ప్రాధాన్యత నిచ్చి ఆగకుండా, మీఓటు చివరిదాకా సజీవంగా ఉండి గెలుపు లో భాగం కావాలంటే బ్యాలెట్ లో ఖచ్చితమైన ఓటింగ్ విధానాన్ని పాటించాలి.

ఓటింగ్ విధానం ఇలా:

బ్యాలెట్ పేపర్ లో పోటీ చేసిన అభ్యర్థుల పేరు, పార్టీ, లేద స్వతంత్ర, పక్కన బాక్స్ ఉంటాయి. ఎంత మంది పోటీచేస్తే అందరివి ఉంటాయి. పోలింగ్ అధికారి మనకు ఇచ్చిన పెన్నుతో1, 2 ,3 ,4,...ఇలా ప్రాధాన్యత క్రమంలో మీ ఓటును కేటాయించాలి. మొదటి ప్రాధాన్యత ఓటు మాత్రం తప్పక వేయాలి.(1) ఒక్కరికీ ఓటు వేయవచ్చు లేదా కొంతమందికి లేదా అందరికి వేయవచ్చు. అది మన ఇష్టం. కానీ ప్రాధాన్యత ఓటు తప్పవద్దు. ఆ ప్రాధాన్యత ఎలాగో చూద్దాం

మొత్తం ఎన్నికల బరిలో 70 మంది ఉన్నారు. నేను ఒక ఆరుగురికి వేద్దాం అనుకొని బ్యాలెట్ పేపర్ పరిశీలించి. అందులో ఒకరికి 1 వేసి, ఇక నేను అనుకున్న వారికి 2, 3, 4, 5, 6 అను నెంబర్లు వారి ఎదురుగా గలా బాక్స్ లో రాశాను. ఒకవేల 10 కి అనుకుంటే నేను అనుకున్న వారికి 1 ,2,....10.. లేదా అందరికి అనుకుంటే  1,2,.....70

ఉదాహరణకు నేను ఆరుగురికి ఓటు వేద్దాం అనుకున్నాను అనుకోండి. నేను 1 వేద్దామకున్న అభ్యర్థి S. No.20 వారికి 1 రాశాను. ▪️ఇలా ఎక్కడ ఉన్నారో చూసుకొని వారికి నేను అనుకున్న నెంబర్ రాస్తా.

 గమనిక

✅బ్యాలెట్ పేపర్ పై కేవలం 1,2,3, అను అంకెలు మాత్రమే రాయాలి.

❌రోమన్ అంకెలు I  II  III అని రాయకూడదు ఓటు చెల్లదు.

❌ఒకటి,రెండు..అని తెలుగులో రాయవద్దు.ఓటు చెల్లదు.

❌ఇలా ✔️టిక్ చేయవద్దు ఓటు చెల్లదు.

❌one, two అని రాయవద్దు.ఓటు చెల్లదు.

✅నేను ఆరుగురికి వేద్దాం అనుకుని.

1,2,3,4,5,6 ఎవరికి ఏ నెంబర్ ఓటు వేయాలో వారికి వేయాలి. ఒకరికి వేసిన నెంబర్ ఇంకోకరికి వేయకూడదు. అదే సందర్బంలో 1 నుంచి 6 వరకు సంఖ్య ఓట్ల క్రమంలో ఎక్కడా ఏ సంఖ్య ఓటును మిస్ కాకూడదు. 1నుండి 6 వరకు ఉన్నాయి.. మధ్యలో మిస్ కాలేదు.

❌2,3,4,5,6 రాశాను కానీ.. 1 రాయలేదు కాబట్టి ఆ ఓటు చెల్లదు. ఇంకో ఉదాహరణ ప్రకారం

❌1,2,4,5,6 ఇలా రాశాను..కానీ ఓటు చెల్లదు. కారణం మధ్యలో ఉండే 3వ అంకేను ఏ అభ్యర్థికి రాయకుండా మరిచిపోయాను కాబట్టి ఆ ఓటు చెల్లదు. ఇక ఇలా చేసిన మీ ఓటు చెల్లదు.

❌బ్యాలెట్ పేపర్ మీద ఎక్కడ కూడా మీ సంతకం పెట్టవద్దు.ఒకవేళ పెడితే ఓటు చెల్లదు.

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: