ఆదర్శ రాష్ట్రం దిశగా అడుగులు

కేసీఆర్ తోనే సాధ్యం

పులిగొరి గోవర్ధన్ రెడ్డి స్పష్టం

(జానోజాగో వెబ్ న్యూస్-లీగల్ ప్రతినిధి)

తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి కృషి చేసే మహానాయకుడు, ముఖ్యమంత్రి కేసీఆర్ కే సాధ్యమని తెలంగాణ లీగల్ సెల్ న్యాయవాది పులిగోరి గోవర్ధన్ రెడ్డి స్పష్టం చేశారు. ఉద్యోగులకు, ఉపాధ్యాయులకు 30 శాతం ఫిట్ మెంట్ ప్రకటించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రంగారెడ్డి జిల్లా కోర్టు ఆవరణలో టపాసులు కాల్చి, స్వీట్లు పంపిణీ చేసి సంతోషం వ్యక్తం చేశారు. ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో సైతం తెరాస అభ్యర్థులను పట్టభద్రులు గెలిపించడం పట్ల ధన్యవాదాలు తెలిపారు. న్యాయ వాదులకు అన్ని రకాలుగా రాష్ట్ర ప్రభుత్వం సహకరిస్తోంది అని పేర్కొన్నారు.

అదేవిధంగా న్యాయవాది ఉపేందర్ మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ది కేసీఆర్ ద్వారానే సాధ్యం అవుతుంది అన్నారు. పట్టభద్రులకు ఉద్యోగ అవకాశాలను పెంచేందుకు కృషి చేస్తోందని కొనియాడారు. యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు. కరోనా ప్రభావం మళ్లీ పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం తరఫున అన్ని చర్యలు తీసుకుంటున్నారనీ అన్నారు. రాబోవు రోజుల్లో " బంగారు తెలంగాణ " ముఖ్యమంత్రి కేసీఆర్ ఆశయమని, ఆయన ఆధ్వర్యంలో మరింత అభివృద్ధి చెందేందుకు ప్రభుత్వము నడుం బిగించింది అని తెలిపారు. న్యాయవాదులకు, పట్టభద్రులకు కృతజ్ఞతలు ప్రకటించారు.

✍️ రిపోర్టింగ్-డి.అనంత రఘు

న్యాయవాది. హైదరాబాద్

,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి 

  

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: