నంద్యాలను నందనవనంగా చేస్తా

మున్సిపల్ చైర్మన్ గా బాధ్యతలు చేపట్టిన మాబున్నిసా

ఛైర్మెన్ కు ఘనస్వాగతం పలికిన మునిసిపల్ కమిషనర్, సిబ్బంది 

(జానోజాగో వెబ్ న్యూస్-కర్నూలు జిల్లా ప్రతినిధి)

నంద్యాల పట్టణాన్ని నందనవనం చేస్తానని మున్సిపల్ చైర్మన్ మాబున్నిసా అన్నారు. ఛైర్మెన్ మాబున్నిసా సోమవారం మున్సిపల్ కార్యాలయానికి చేరుకోవడంతో కమీషనర్ వెంకటకృష్ణ,అధికారులు ఘన స్వాగతం పలికారు. ఛైర్మెన్ ఛాంబర్లో బాధ్యతలు చేపట్టి తొలి సంతకాన్ని చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఛైర్మెన్ మాబున్నిసా మాట్లాడుతూ...

 

చైర్మన్ గా బాధ్యతలు చేపడుతున్న మాబున్నీసా 

స్వాగతం పలుకుతున్న కమిషనర్, సిబ్బంది

అభినందిస్తున్న సిబ్బంది

నంద్యాలను నందనవనం చేయడానికి అందరి సహకారంతో అభివృద్ధి చేస్తామన్నారు. పట్టణంలోని 42 వార్డుల్లో అభివృద్ధితో పాటు సమస్యలు లేకుండా చూసేందుకు ప్రయత్నం చేస్తామన్నారు. పారిశుధ్యం, మంచినీటి సమస్యపై ప్రత్యేక దృష్టికేంద్రీకరిస్తామన్నారు. రాష్ట్ర చరిత్రలో నంద్యాల మున్సిపాలిటీ ఛైర్మెన్ గా మైనార్టీలకు కేటాయించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు  సహకారం అందించిన మాజీమంత్రి శిల్పా మోహన్ రెడ్డి, ఎమ్మెల్యే శిల్పారవిచంద్ర కిషోర్ రెడ్డి లకు ధన్యవాదాలు తెలిపారు. అధికారులు మర్యాదపూర్వకంగా పుష్పగుచ్ఛాలు ఇచ్చారు. అనంతరం మున్సిపల్ కార్యాలయంలోని అన్నిశాఖల్లోని అధికారులతో మాట్లాడారు.

,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి 

 Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: