నవనందుల నంద్యాలను అభివృద్ధిచేద్దాం

మున్సిపల్ కమీషనర్ తో కౌన్సిలర్ శిల్పా నాగినిరెడ్డి 

(జానోజాగో వెబ్ న్యూస్-కర్నూలు ప్రతినిధి)

నవనందుల నంద్యాలను అభివృద్ధిపథంలో తీసుకొస్తామని కౌన్సిలర్ శిల్పా నాగిణిరెడ్డి అన్నారు. ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత శుక్రవారం మున్సిపల్ కమీషనర్ వెంకట కృష్ణను ఎమ్మెల్యే శిల్పా రవిచంద్రకిశోర్ రెడ్డి సతీమణి,  కౌన్సిలర్ శిల్పా నాగిణిరెడ్డి మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందించారు. ఈ సందర్భంగా వారు పట్టణ అభివృద్ధిపై చర్చించారు. పట్టణంలోని 42 వార్డుల్లో ప్రధాన సమస్యలు గుర్తించాలన్నారు.
వేసవి కాలం దృష్టిలో పెట్టుకొని మంచి నీటికి ప్రజలు ఇబ్బందులు పడకూడదన్నారు. దోమల సమస్య అధికంగా ఉందని వార్డుల్లో ఫాగింగ్ చేయాలన్నారు. రాత్రివేళల్లో ప్రజలు ఇబ్బందులు పడకుండా వేధిలైట్ల సమస్య లేకుండా చూడాలని అన్నారు. రోడ్లపై చెత్తా చెదారం లేకుండా చూడాలని, కాల్వలు శుభ్రంగా వుండే విధంగా సిబ్బందికి ఆదేశాలు ఇవ్వాలన్నారు. మున్సిపాలిటి ఆదాయవనరులపై దృష్టి కేంద్రీకరిస్తే నిధులు లభించడంతో పట్టణం అభివృద్ధి చెందుతుందన్నారు. ఇంటిపనులు, కొళాయి పన్నులు బకాయి లేకుండా చూడాలన్నారు. నంద్యాల అభివృద్ధి పై పలు సూచనలు అందించారు.

,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి 

 

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: