ఆర్పీ పై చర్యకు న్యాయ నిపణులతో సంప్రదింపు

పీఎఫ్ బకాయిల పై పీఎఫ్ రీజినల్ కమిషనర్ కు పిర్యాదు 

(జానోజాగో వెబ్ న్యూస్-హైదరాబాద్ బ్యూరో)

 డెక్కన్ క్రానికల్ ఉద్యోగుల నుంచి కట్ చేసిన పీ ఎఫ్ డబ్బులను వారి ఖాతాల్లో జమ చేయకుండా ఏళ్ల తరబడిగా  జాప్యం చేస్తున్న యాజమాన్యం పై బుధవారం ఆంధ్రభూమి ఎంప్లాయీస్ అసోసియేషన్ పిర్యాదు చేసింది. ఈ మేరకు అసోసియేషన్ కన్వీనర్ వెల్జాల చంద్రశేఖర్, విజయ ప్రసాద్, స్వామినాథ్ బర్కత్ పురా లోని   రీజినల్ పీ ఎఫ్ కమిషనర్ కే వెంకటేశ్వర్లు ను కలిసి లిఖిత పూర్వకంగా పిర్యాదు చేసింది. డెక్కన్ క్రానికల్ యాజమాన్యం ఇప్పటివరకు ఉద్యోగుల నుంచి  వసూలు చేసిన రూ. 15 కోట్లు బకాయిపడి ఉందని కమిషనర్ వివరించారు. డీ సీ యాజమాన్యానికి నోటీసులు జారీ చేయగా కేసు NCLT లో పెండింగ్ లో ఉందని తప్పించుకుంటున్నారని కమీషనర్ వివరించారు. పీ ఎఫ్ బకాయిలు క్లియర్ చేయాల్సిన బాధ్యత ఆర్ పీ మమత బినాని పై ఉందన్నారు. సెక్షన్ 406, 408 ప్రకారం ఆర్ పీ పై ఎఫ్ ఐ ఆర్ దాఖలు చేసే అంశం పై న్యాయ నిపుణులను సంప్రదిందిస్తున్నట్టు కమీషనర్ తెలిపారు. ఆంధ్రభూమి ఎంప్లాయీస్ అసోసియేషన్ చేసిన పిర్యాదు పై వెంటనే నోటీస్ జారీ చేయనున్నట్లు కమీషనర్ హామీ ఇచ్చారు.

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: