తల్లి ఆశయం నెరవేర్చిన కుమారుడు

కుమారున్ని కౌన్సిలర్ గా చూడకుండానే కన్ను మూసిన కన్నతల్లి 

(జానోజాగో వెబ్ న్యూస్-కర్నూలు ప్రతినిధి)

నంద్యాల పట్టణం నాలుగో వార్డులో కౌన్సిలర్ అభ్యర్థిగా వైయస్సార్ సిపి తరఫున నిలబడి విజయం సాధించిన తబ్రేజ్ విద్యావంతుడు,  మృదుస్వభావి, నిజాయితీపరుడు. ఇతరుల మనసు నొప్పించకూడదన్నేదే అతని లక్ష్యం. ఎన్నో ఏళ్ళ నుండి ప్రజా సేవా చేస్తూ  ప్రజల్లో మంచి అభిమానాన్ని,  నమ్మకాన్ని సంపాదించుకున్నాడు. ఉదాహరణకు ఎవరైనా ఒక పని చేసి పెట్టమని అడిగితే ఏదైనా ఆశిస్తారు కానీ తబ్రేజ్ ఏదీ ఆశించకుండా పనిచేసి పెట్టడమే తన ధ్యేయమన్నారు, వైశ్యులు, ముస్లింలు అధికంగా ఉన్న ఆ ప్రాంతంలో అన్ని వర్గాల మన్ననలు పొందాడు.

 


4వ వార్డులో తన వంతుగా అనేక సేవా కార్యక్రమాలు చేశాడు తబ్రేజ్. మంచితనానికి అతని స్నేహితులు కూడా సెల్యూట్ చేసి అతనికి సహకరించారు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఏ తల్లి అయినా తన కుమారుడు మంచి ఉద్యోగం సంపాదించి మంచి ప్రయోజకుడు కావాలని కోరుకుంటారు. అలానే తబ్రేజ్ తల్లి ఖైరున్ బీ తనకుమారుడి సేవా భావాలను చూసి మురిసిపోయింది. తను చనిపోయేముందు కుమారుని దగ్గరకు పిలిచి నీవు ఈ వార్డు కౌన్సిలర్ కావాలని కోరుతూ దీవించింది. ఆ తల్లి దీవెనలతో కుమారులు తబ్రేజ్ సేవా కార్యక్రమాలు చేస్తూ తన తల్లి ఖైరున్ బీ ఆశయాన్ని నెరవేర్చాలని పట్టువీడని తబ్రేజ్ పైసా ఆశించకుండా ప్రభుత్వ పథకాలు సాధించేందుకు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేసి లబ్ధిదారులకు న్యాయం జరిగేంత వరకు పోరాడి సాధించాడు.  అయితే ఆ తల్లి కొడుకును కౌన్సిలర్ గా  చూడకుండానే కన్ను మూసింది. ఇక కరోనా సమయంలో తబ్రేజ్ సేవాలు మరువాలేనివి కరోనా కిట్లను పంపిణీ చేశారు 24 రకాల నిత్యావసర వస్తువులను తన స్వంత నిధులు వెచ్చించి తన వార్డు ప్రజలకే కాకుండ ఇతరులకు కూడా పంపిణీ చేశారు.
ఈ మంచితనమే 4వ వార్డు ప్రజల మనసులో మార్కులు సాధించాడు అదే అతని పాలిట వరంగా మారింది తల్లి ఖైరున్ బీ దీవెనలు ప్రజల ఆశీస్సులతో నేడు కౌన్సిలర్గా ఎన్నికయ్యాడు ఇలాంటి కౌన్సిలర్ ఉండగా వార్డ్ ప్రజలు నిశితంగా ఉండగలుగుతారు తబ్రేజ్ మాత్రం తల్లి దీవెన వార్డు ప్రజల దీవెనే నా గెలుపుకు కారణమంటూ మళ్లీ వాళ్ల దగ్గర మార్కులు కొట్టేశాడు ఇది 4, వార్డ్ కౌన్సిలర్ గా గెలుపు తన తల్లికి,  వార్డు ప్రజలకు తన స్నేహితులకు పెద్దలకు గౌరవనీయులు ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డికి,  మాజీ మంత్రివర్యులు శిల్పా మోహన్ రెడ్డి,  నంద్యాల ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి, మరీ ముఖ్యంగా ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతూ నా తల్లి ఖైరూన్ బికి ఈ గెలుపు అంకితం చేస్తున్నాననితన తల్లి లేకపోయినా ఆమె దీవెనలు ఉంటాయని సెప్పుకొచ్చారు.
 ,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి 

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: