నా దృష్టికి వచ్చిన ప్రతి సమస్యను పరిష్కరిస్తా

ఛైర్మన్ అభ్యర్ధి  చిర్లంచర్ల మురళీకృష్ణ

(జానోజాగో వెబ్ న్యూస్-మార్కాపురం ప్రతినిధి)

      ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణ మున్సిపల్ ఎన్నికలలో వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ తరపున 6వ వార్డు కౌన్సిలర్ గా గెలుపొంది ఛైర్మన్ అభ్యర్ధిగా బరిలో ఎన్నికయిన  చిర్లంచర్ల మురళీకృష్ణ తమప్రత్యర్ధిపై 1175 భారి ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు.

ఈ సందర్భంగా కృష్ణ మాట్లాడుతూ ముఖ్యంగా మన ఎం.ఎల్.ఎ. కుందూరు నాగార్జున రెడ్డి పూర్తి సహాయసహకారాలతో  పాటు నా విజయానికి కారణమైన ఆర్యవైశ్య సంఘం వారికి, ప్రధమ శ్రేణి నాయకులు,  మైనారిటి నాయకులు షంషీర్ అలీబేగ్ కు  ప్రత్యక్షంగాను, పరోక్షంగాను నాపై నమ్మకముంచి నావిజయానికి సహకరించిన నా వార్డు ప్రజలందరికి పేరుపేరున కృతజ్ఞతలు తెలియచేశారు. ఇదే విధంగా నా దృష్టికి వచ్చిన ప్రతి ఒక్కరి సమస్యను నా సమస్యగా భావించి వారికి న్యాయం జరిగేలా నా వంతు కృషి చేస్తానని తెలిపారు.
 

✍️ రిపోర్టింగ్-షేక్ గౌస్ బాషా

జానోజాగో వెబ్ న్యూస్-బ్యూరో చీఫ్       

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: