ప్రైవేటీకరణను ఉపసంహరించుకోవాలి
పెట్రోల్ డీజిల్ ధరలను తగ్గించాలి
ఏఐటీయూసీ
(జానోజాగో వెబ్ న్యూస్-కర్నూలు జిల్లా ప్రతినిధి)
విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణను వెంటనే ఉపసంహరించుకొని పెంచిన పెట్రోల్ , డీజిల్ వంట నూనె, నిత్యావసర వస్తువుల ధరలను ఏపసంహరించుకోవాలని, రైతులకు వ్యతిరేకంగా తెచ్చిన నల్ల చట్టాలను వెంటనే ఉపసంహరించుకోవాలని భారత్ బంద్ లో భాగంగా నంద్యాల ఎఐటియుసి ఆధ్వర్యంలో బందు నిర్వహించి అనంతరం శ్రీనివాస్ సెంటర్లో దాదాపు గంటసేపు రాస్తారోకో నిర్వహించడం జరిగింది.
ఈ సందర్భంగా ఏఐటియుసి జిల్లా కార్యదర్శి కె.ప్రసాద్, అధ్యక్ష, కార్యదర్శులు శ్రీనివాసులు, వెన్న బాల వెంకట్ మాట్లాడుతూ గత నాలుగు నెలలుగా రైతులు ఆందోళన చేస్తున్నప్పటికీ బీజేపీ ప్రభుత్వం రైతు వ్యతిరేక చట్టాలను ఉపసంహరించుకోవడంలో పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తుందని, బిజెపి పార్టీకి పోయే రోజులు దగ్గరపడ్డాయని అలాగే పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలను నిత్యావసర సరుకుల ధరలను ఉపసంహరించుకోవాలని కార్మిక చట్టాలను సవరణల పేరుతో 44 చట్టాలను నాలుగు కోడ్ లుగా విభజించి కార్మిక హక్కులను కాలరాస్తున్నారని,
అలాగే లాభాల్లో నడుస్తున్నటువంటి ప్రభుత్వ రంగ సంస్థలను ఎల్ఐసి ,రైల్వేలు, బ్యాంకులను మొత్తం ప్రైవేట్ పరం చేయడానికి ఈ బీజేపీ ప్రభుత్వం పూనుకుందని ఆరోపించారు. దీనికి వ్యతిరేకంగా ఉద్యోగులు కార్మికులు, ప్రజలు, రైతులు, అందరూ ప్రజా వ్యతిరేక విధానాలను వ్యతిరేకించాలని, ప్రధానంగా విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఉద్యమాలు నిర్వహించాలని బిజెపి ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పాలని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ డివిజన్ నాయకులు మహమ్మద్, మురళి, కృష్ణరెడ్డి, వెంకటేశ్వర్లు నాయకత్వం వహించారు. ఈ కార్యక్రమంలో వందమంది ఎఐటియుసి నాయకులు పాల్గొన్నారు.
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,
రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి
Post A Comment:
0 comments: