నంద్యాల ప్రజల హృదయాల్లో నిలిచిపోయె పాలన ఇవ్వండి

బాధ్యతలు స్వీకరించిన మున్సిపల్ ఛైర్మన్ ను..

అభినందించిన జమాఆతె ఇస్లామీ నాయకులు

(జానోజాగో వెబ్ న్యూస్-కర్నూలు జిల్లా ప్రతినిధి)

120 ఏళ్ల చరిత్ర కలిగిన నంద్యాల మున్సిపాలిటీలో మొదటిసారిగా ఛైర్మన్ బాధ్యతలు స్వీకరించిన ముస్లిం మైనార్టీ మహిళ అయిన మహబున్నిసాను నంద్యాల జమాతె ఇస్లామీ హింద్ నంద్యాల శాఖ అధ్యక్ష కార్యదర్శులు సీ. యం. జకరియా, అబ్దుల్ సమద్,  నాయకులు ఫయాజ్, ముహమ్మద్ షఫీ, అబ్దుల్ అలీం, ముస్తఫా  ఛైర్మన్ ను ఆమె ఛాంబర్ లో శాలువ కప్పి, బొకె మెమొంటో ఇచ్చి ఘనంగా సన్మానించి అభినందించారు.
ఈ సంధర్భంగా జకరియా, సమద్ మాట్లాడుతూ నంద్యాల కౌన్సిల్ కు ఎన్నికైన సభ్యులదరికి అభినందించారు. మరీ ముఖ్యంగా ఈసారి 23 మంది మహిళలు, ఎన్నికకావడం, 14మంది ముస్లిం మైనార్టీలు కౌన్సిల్ కు పంపిన పట్టణ ప్రజలకు ధన్యవాదాలు తెలుపుతున్నట్లు తెలిపారు. ఈ అవకాశాన్ని కలిగించిన ముఖ్యమంత్రి జగన్ కు,  శాసన సభ్యులు శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. జకరియా, సమద్ మాట్లాడుతూ ఛైర్మన్ గా పార్టీలకు అతీతంగా, మతాలకు అతీతంగా మంచి పాలన అందించి నంద్యాల చరిత్రలో ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయె పాలన అందివ్వాలని, ధైర్యంగా ముందుకు సాగాలని కోరారు. ఏంఎల్ఏ, ప్రజల సహకారంతో నంద్యాల అవసరాలు తీర్చేందుకు అహర్నిశలు ప్రయత్నిస్తానని మహబున్నిసా తనకు అభినందించిన పెద్దలకు ధన్యవాదాలు తెలిపారు.

,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి 

 

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: