సమాచార హక్కు ప్రచార ఐక్యవేదిక..

నంద్యాల నూతన కమిటీ ఎన్నిక

(జానోజాగో వెబ్ న్యూస్-కర్నూలు జిల్లా ప్రతినిధి)

సమాచార హక్కు ప్రచార ఐక్యవేదిక నంద్యాల నూతన కమిటీని ఆదివారం ఎన్నుకోవడం జరిగింది. నంద్యాలలోని సమాచార హక్కు ప్రచార ఐక్యవేదిక నంద్యాల డివిజన్ కార్యాలయం నందు కర్నూలు జిల్లా ప్రధాన కార్యదర్శి ఆకుమల్ల రహీమ్ అధ్యక్షతన ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి రాష్ట్ర ఉపాధ్యక్షులు రామకృష్ణారెడ్డి, కర్నూలు జిల్లా అధ్యక్షులు అడ్వకేట్ శ్రీధర్ హాజరు కావడం జరిగింది. ఈ సందర్బంగా రాష్ట్ర ఉపాధ్యక్షులు రామకృష్ణరెడ్డి మాట్లాడుతూ భారత రాజ్యాంగ గ్రంథం భారత పౌరులకు ధర్మ గ్రంథమని, ప్రతి భారత పౌరుడు భారత రాజ్యాంగ ధర్మ గ్రంధాన్ని కచ్చితంగా అనుసరించాలని, రాజ్యాంగ గ్రంథం ప్రకారమే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్థానిక ప్రభుత్వాలు అన్నీ కూడా భారత రాజ్యాంగం ప్రకారమే పాలన కొనసాగించాలని, కానీ  దురదృష్టకరం ఏమంటే భారత రాజ్యాంగ గ్రంథం గురించి భారత పౌరులకు కనీస అవగాహన కూడా లేకపోవడం బాధాకరమన్నారు. అందువలననే మా సమాచార హక్కు ప్రచార ఐక్యవేదిక భారత పౌరులకు సమాచార హక్కు చట్టం గురించి, భారత రాజ్యాంగం గురించి, గ్రామాలలో గ్రామ సభలు పట్టణాలలో వార్డు సభలు గురించి అవగాహన కల్పిస్తున్నామన్నారు. గ్రామ సభలు, వార్డు సభలు సక్రమంగా నిర్వహించగలిగితే గాంధీ కలలు కన్న గ్రామ స్వరాజ్యం వస్తుందని, ఆ దిశగా ప్రజలను అవగాహనపరులుగా మారుస్తూ చట్టాల గురించి వివరిస్తూ శిక్షణను నిర్వహిస్తూ వస్తున్నామన్నారు.
జిల్లా అధ్యక్షులు అడ్వకేట్ శ్రీధర్ మాట్లాడుతూ భారత రాజ్యాంగ గ్రంథంలో పౌరులే యజమానులని,  పర్యవేక్షణ బాధ్యత యజమాని అయిన భారత పౌరునిగా బాధ్యతను గుర్తించి పర్యవేక్షణ చేయాలని కోరారు. ప్రభుత్వాలు పారదర్శకంగా జవాబుదారితనంగా పరిపాలన సాగించినప్పుడే దేశం గాని, సమాజం గాని అభివృద్ధి చెందుతుందన్నారు. ప్రజలందరూ తాము యజమానులమని  గుర్తుపెట్టుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో నంద్యాల పట్టణ నూతన కమిటీని జిల్లా ప్రధాన కార్యదర్శి  ఆకుమల్ల రహీమ్ అధ్యక్షతన ఏకగ్రీవంగా కమిటీని ఎన్నుకోవడం జరిగింది. పట్టణ అధ్యక్షుడిగా షేక్. హుస్సేన్, ప్రధాన కార్యదర్శిగా పి. రామకృష్ణ,  కోశాధికారిగా డి. మస్తాన్,  ఉపాధ్యక్షులుగా నాగేశ్వర్ రెడ్డి, నబి రసూల్, సహాయ కార్యదర్శిగా సత్యనారాయణలను నంద్యాల పట్టణ నూతన కమిటీ ఎన్నుకోవడం జరిగిందన్నారు. అదే విధంగా నంద్యాల మండల కమిటీ అధ్యక్షులుగా చాబోలు ఉమా మహేష్, ప్రధాన కార్యదర్శిగా ముళ్ళ ఆరిఫ్ ఉద్దీన్, కోశాధికారిగా నాగేశ్వరరావు, ఉపాధ్యక్షులుగా కానాల అక్బర్ బాషా, శివ నారాయణ, సహాయ కార్యదర్శులుగా పుసులూరు ఫణీంద్ర వీరందరినీ 2021 నుండి 2023 వరకు రెండు సంవత్సరాల  కాలపరిమితి కొరకు ఎన్నుకోవడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమము నందు నంద్యాల డివిజన్ లోని బండి ఆత్మకూరు, వెలుగోడు, పాములపాడు, నంద్యాల మండలాల నుండి దాదాపు 100మంది కార్యకర్తలు హాజరు కావడం జరిగింది.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు సమాచార హక్కు ప్రచార ఐక్యవేదిక రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎం రామకృష్ణ రెడ్డి, కర్నూలు జిల్లా అధ్యక్షులు అడ్వకేట్ శ్రీధర్, కర్నూలు జిల్లా ప్రధాన కార్యదర్శి ఆకుమల్ల రహీం,  కర్నూలు జిల్లా సహాయ కార్యదర్శి నందికొట్కూరు జయరాం, అన్సర్ భాష,  బండి ఆత్మకూరు మండల అధ్యక్షులు రామరాజు, పాములపాడు మండల కన్వీనర్ యన్. చిన్న నాగన్న, విజయ పాల డైరీ డైరెక్టర్ మల్లికార్జున,  సాంస్కృతిక విభాగపు జిల్లా నాయకులు శివరాం రెడ్డి, ఐక్య వేదిక సభ్యులు నాగేశ్వర్ రెడ్డి, చెన్నారెడ్డి, రమేష్, భద్ర తదితరులు పాల్గొనడం జరిగింది.

,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి 

 

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: