కర్నూల్ జిల్లాలో ఈడీ అధికారులు సోదాలు

- జిల్లా వ్యాప్తంగా ఎస్డిపిఐ, పిఎఫ్ఐ నాయకుల ఇళ్లలో సోదాలు 

భారీ బందోబస్త్ నడుమ పోలీసులు 

(జానోజాగో వెబ్ న్యూస్-కర్నూలు జిల్లా ప్రతినిధి)

కర్నూల్ జిల్లాలో ఈడీ అధికారులు సోదాలు నిర్వహించారు. నంద్యాల, ఎమ్మిగనూరు, ఆదోనితో పాటు పలు ప్రాంతాల్లో జిల్లా వ్యాప్తంగా ఎస్డిపిఐ, పిఎఫ్ఐ నాయకుల ఇళ్లలో సోదాలు నిర్వహించారు. నంద్యాల పట్టణ పరిధిలోని పలు ఇళ్లలో ఈడీ అధికారులు సోదాలు నిర్వహించారు. మంగళవారం ఉదయం నుండి పట్టణంలోని పాలిటెక్నిక్ కళాశాల సమీపంలోని సప్తగిరి షైన్ అపార్ట్మెంట్, ఉప్పరిపేటలో ఈడీ అధికారులు సోదాలు నిర్వహించారు.
అలాగే అయ్యలూరు, కానాల ప్రాంతాల్లో ఈడీ అధికారులు సోదాలు చేస్తుండటంతో ప్రజలు ఏమి జరుతుందోనని ఆందోళన చెందుతున్నారు. సోదాలు జరుగుతున్న ప్రాంతాలకు మైనార్టీ యువకులు భారీగా చేరుకున్నారు. ఏమి జరుగుతుందనే ఆతృతతో ఎస్డిపిఐ నాయకులు, కార్యకర్తలు ఆ ప్రాంతానికి భారీగా చేరుకున్నారు. కేంద్ర బలగాలు రావడంతో ప్రజలు ఆసక్తిగా చూస్తున్నారు. సోదాలు ఎందుకు చేస్తున్నారో అర్థంకాని పరిస్థితి. నంద్యాల మండలం కానాలలో, అయ్యలూరు గ్రామాల్లో భారీస్థాయిలో పోలీసులు సోదాలు చేసినట్లు సమాచారం. స్థానిక సిఐలు, పోలీసులు వారి వెంట ఉండి భద్రత కల్పిస్తున్నారు. తనిఖీల అనంతరం మీడియా అడిగిన ప్రశ్నలకు ఇలాంటి సమాధానం చెప్పకుండానే వెనుదిరిగారు.

,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి 

 

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: