దర్శనం కోసం బారులు తీరిన భక్తులు

కరోనా నిబంధనల ప్రకారం మహాశివరాత్రి వేడుకలు

భక్తులతో కిక్కిరిసిన శివాలయాలు

(జానోజాగో వెబ్ న్యూస్-లీగల్ ప్రతినిధి)

కరోనా జాగ్రత్తలు పాటిస్తూ తెలంగాణలోని అన్నీ శివాలయాలు భక్తులతో కిటకిటలాడాయి. మహాశివరాత్రి పర్వదనాన్ని పురస్కరించుకుని భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. గురువారం మహా శివుని అనుగ్రహం పొందడానికి ఉపవాస దీక్షలు చేపట్టి సాయంత్రం ఫలహారాలు తీసుకుని రాత్రి జాగారం చేసేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ప్రధాన ఆలయాలన్నీ భక్తులతో సందోహంగా మారాయి. శివనామస్మరణతో ఆలయాలు మారుమ్రోగుతున్నా యి. భక్తులకు షానిటైజ్ ఏర్పాటు చేసి దూరాన్ని పాటించే విధంగా ఆలయ అధికారులు చర్యలు చేపట్టారు. ప్రతీ ఒక్కరూ విధిగా మాస్క్ ధరించి ఉండాలనే నిబంధన విధించారు. దర్శనానికి వచ్చే ప్రముఖులకు సైతం నిబంధనల మేరకు పోలీసులు భద్రత చర్యలు తీసుకున్నారు.

ట్రాఫిక్ నిబంధనలు సైతం అమలు చేసేలా చర్యలు చేపట్టారు. తీర్థ, ప్రసాదాలు స్వీకరించేందుకు క్యూలైన్లు ఏర్పాటు చేసి భక్తులకు ఇబ్బంది కలగకుండా ఉండేందుకు దేవాలయ ధర్మకర్తలు పూర్తి స్థాయిలో సౌకర్యాలు ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకునేందుకు పోలీసులు ప్రణాళికలు సిద్ధం చేశారు. మహిళలకు ప్రత్యేక దర్శన సదుపాయం అందుబాటులోకి తెచ్చారు. ఈ ఏడాది పండ్ల ధరలు సైతం సామాన్యులకు అందుబాటులో ఉండడం గమనార్హం. తక్కువ ధరలు పలకడంతో భక్తులు అధిక సంఖ్యలో ఉపవాస దీక్షల్లో పాల్గొనే అవకాశం ఉంటుందని భక్తుల అభిప్రాయం. మరుసటి రోజు ఉపవాస దీక్షలు విడిచి అందరూ భోజనాలు చేయడం మహాశివరాత్రి ప్రత్యేకత. భగవంతుడి ఆశీస్సులు భక్తులకు మెండుగా ఉండాలని ఆలయ పూజారులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. 


 

✍️ రిపోర్టింగ్-డి.అనంత రఘు

న్యాయవాది. హైదరాబాద్.

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: