రసోత్తరంగా సాగర్ ఉప ఎన్నిక....?

బిగ్ ఫైట్ తప్పదా....?

ఆచితూచి అభ్యర్థుల ఎంపిక

టీఆర్ఎస్ అభ్యర్థిగా నోముల భగత్

కాంగ్రెస్ అభ్యర్థిగా రాజకీయ ఉద్దండు కె.జానారెడ్డి

బీజేపీ అభ్యర్థిగా నివేదిత రెడ్డి

(జానోజాగో వెబ్ న్యూస్-లీగల్ ప్రతినిధి)

నాగార్జున సాగర్ అసెంబ్లీ ఉప ఎన్నికలు తెలంగాణ రాష్ట్రంలో మరో బిగ్ ఫైట్ ను తలపించనున్నది. అభ్యర్థి ఎంపిక విషయంలోనూ అన్ని రాజకీయ పార్టీలు ఆచితూచి అడుగులేశాయి. సామాజిక, రాజకీయ, కుల ఇలా అన్ని రాజకీయ సమీకరణలపై ప్రత్యేక శ్రద్ద తీసుకొంటున్న రాజకీయ పార్టీలు అభ్యర్థుల విషయంలోనూ అన్ని విధాలా పరిశీలనలోకి తీసుకొన్నాకే ఆయన అభ్యర్థిత్వం ఖరారు చేసినట్లు సమాచారం. తొలినుంచి అభ్యర్థి ఎంపికపై అధికార టీఆర్ఎస్ లో మల్లగుల్లాలు సాగినా చివరకు  నాగార్జున సాగర్ నియోజకవర్గం ఉపఎన్నిక టీఆర్ఎస్ అభ్యర్థిగా న్యాయవాది నోముల భగత్ ను ముఖ్యమంత్రి కేసీఆర్ ఖరారు చేశారు. నోముల నర్సింహం ఆకస్మిక మృతితో ఉపఎన్నిక అనివార్యమైంది. తనయుడు నోముల భగత్ ను ముఖ్యమంత్రి బరిలో దించేందుకు నిర్ణయం తీసుకున్నారు.

 

నాగార్జున సాగర్ అసెంబ్లీ ఉప ఎన్నికల టీఆర్ఎస్ అభ్యర్థి నోముల భగత్

ఈ ఉపఎన్నికలో విజయం కోసం ప్రత్యేక దృష్టి సారించారు. పార్టీ కార్యకర్తలు, నాయకులు, న్యాయవాదులు కలిసి కట్టుగా పనిచేయాలని సూచించారు. మరోవైపు గులాబి దళపతి అభ్యర్థి ఎంపికపైనే కాదు విజయం కోసం ప్రత్యేక శ్రద్ద తీసుకొంటున్నారు. ఇటీవిల పట్టభద్రతుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థులు విజయం సాధించిన విషయం తెలిసిందే. అదే సందర్భంలో నాగార్జున సాగర్ అసెంబ్లీ స్థానం తనకు సిట్టింగ్ కావడంతో టీఆర్ఎస్ ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకొంటోంది. ఇటీవల కొన్ని నెలల కిందట టీఆర్ఎస్ తన సిట్టింగ్ స్థానమైనా దుబ్బాక అసెంబ్లీని చేజార్చుకోవాల్సి వచ్చింది. అక్కడ పకడ్భందీ వ్యూహంతో బీజేపీ ఆ స్థానం కైవసం చేసుకొంది. అలాంటి పొరపాటు మరోసారి జరగకూడదని టీఆర్ఎస్ యోచిస్తోంది. అందుకు తగ్గ ప్రణాళికలను రూపొందించుకొని ఆ పార్టీ ముందుకెళ్తోంది. ఇదిలావుంటే  కాంగ్రెస్, బిజెపి అభ్యర్థులను చిత్తు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. ప్రజల సానుభూతి, పథకాల అమలు ప్రజలకు అర్థమయ్యేలా సభలు, సమావేశాలు, ప్రచార సభలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. అభ్యర్థి ఎంపిక పట్ల తెలంగాణ న్యాయవాదులు హర్షం వ్యక్తం చేశారు. అదేవిధంగా కేసీఆర్ అభిమాన సంఘం న్యాయ వాదులు మద్దతు ప్రకటించారు. ఇక రాజకీయ ఉద్దండు అయిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత కె.జానారెడ్డి తన స్థానమైన నాగార్జున సాగర్ లో ఓడిపోయిన వదులుకోవాల్సి వచ్చింది.

 


నాగార్జున సాగర్ అసెంబ్లీ ఉప ఎన్నికల కాంగ్రెస్ అభ్యర్థి కె.జానారెడ్డి

తిరుగులేని నేతగా ప్రాచుర్యమున్న కె.జానారెడ్డి గత అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి నోముల నర్సింహయ్య చేతిలో ఓటమి చెందారు. నాటి నుంచి కసిమీద ఉన్న జానారెడ్డి తన ప్రాభల్యాన్ని మరోసారి ప్రదర్శించాలని యోచిస్తున్న తరుణంలో నాగార్జున సాగర్ ఉప ఎన్నికలను ఓ అవకాశంగా కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. అందుకే తన సిట్టింగ్ స్థానం తిరిగిపొందేందుకు కాంగ్రెస్ అధిష్టానం ఆ స్థానంలో తన అభ్యర్థిగా కె.జానారెడ్డినే ప్రకటించి బరిలోకి దించుతోంది. గత కొన్ని పర్యాయాలు ఎదురవుతున్న ఓటముల నేపథ్యంలో ఈ సారి ఎలాగైనా సాగర్ ఉప ఎన్నికల్లో గెలిచి పార్టీలో నూతనోత్సాహం నింపాలని కాంగ్రెస్ పార్టీ నాయకత్వం భావిస్తోంది.

 

నాగార్జున సాగర్ అసెంబ్లీ ఉప ఎన్నికల బీజేపీ అభ్యర్థిగా నివేదిత రెడ్డి

ఇక దుబ్బాక గెలుపు ఆనందం ఎంతోకాలం బీజేపీకి నిలవలేదు. మొన్నటి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ సిట్టింగ్ స్థానాన్ని పోగొట్టున్న బీజేపీ ఈ ఓటమినుంచి తిరిగి పార్టీ శ్రేణులను ఉత్సాహ పరిచేందుకు సాగర్ ఉప ఎన్నికల్లో గెలుపే ధ్యేయంగా ముందుకెళ్తోంది. ఇందుకులో భాగంగానే తన అభ్యర్థి ఎంపికలోనే బీజేపీ పలు అంతర్మథనంలా నేపథ్యంలో తన పార్టీ అభ్యర్థిగా నివేదిత రెడ్డిని ప్రకటించింది. ఇలా మూడు ప్రధాన పార్టీలు సాగర్ ఉప ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో అక్కడ్ బిగ్ ఫైట్ తప్పదని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

✍️ రిపోర్టింగ్-డి.అనంత రఘు

న్యాయవాది. హైదరాబాద్

,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి 

  


Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: