పైసా..పరమాత్మ సినిమా పోస్టర్స్ విడుదల

- క్రైం సస్పెన్స్ సినిమాను ఆదరించండి

- నంద్యాల హీరో "కృష్ణ తేజా"ను ఆశీర్వదించండి

- ఒక విద్యార్థి సినీ హీరో..మరో విద్యార్థి తహసీల్దార్

- జన్మ సార్థకమైందన్న డాక్టర్ రామకృష్ణారెడ్డి

(జానోజాగో వెబ్ న్యూస్-కర్నూలు జిల్లా ప్రతినిధి)

కష్టానికి ప్రతిఫలం లభిస్తుందనటానికి ఉదాహరణ సినీ హీరో కృష్ణ తేజ నిలిచారు. నంద్యాల మండలం మిట్నల గ్రామానికి చెందిన కృష్ణతేజ వ్యవసాయ కుటుంబంలో జన్మించారు. నంద్యాల శ్రీ రామకృష్ణా డిగ్రీ కాలేజీలో డిగ్రీవరకు చదివి ఎస్వీ యూనివర్సిటీలో పీజీ పూర్తిచేశారు. చదువుకునే రోజుల్లో సినిమాలో నటించాలనే కోరిక బలంగా ఉండేది. సినీ రంగంలో అడుగుపెట్టడానికి 15 సంవత్తరాలు కష్టపడి విజయం సాధించారు. చిన్న, చిన్న పాత్రలు పోషిస్తూ హీరో స్థాయికి ఎదిగి పైసా పరమాత్మ సినిమాలో హీరో అయ్యారు.
సినిమా నేడు విడుదల సందర్భంగా నంద్యాలలో పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. శ్రీ రామకృష్ణా డిగ్రీ కళాశాలలో సినీ హీరో కృష్ణ తేజ, తహసీల్దార్ రవికుమార్, ఆర్వీ సుబ్బారెడ్డి, నిమ్మకాయల సుధాకర్, సుబ్బారెడ్డి చేతులమీదుగా సినిమా పోస్టర్ను విడుదల చేసారు. ఈ సందర్భంగా రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ మహాశివరాత్రి పర్వదినం జీవితంలో మరచిపోలేని రోజన్నారు. తన వద్ద చదువుకున్న విద్యార్థుల్లో ఒకరు కృష్ణ తేజ సినీ హీరో కావడం, మరొకరు రవికుమార్ తహసీల్దార్ గా ఉద్యోగం చేయడం సంతోషంగా ఉందన్నారు. సినిమా సక్సెస్ అయ్యి నంద్యాలకు గౌరవం రావాలన్నారు. శిష్యులు ఎదుగుదల గురువులకు సంతోషమన్నారు. తహసీల్దార్ మాట్లాడుతూ డిగ్రీ జీవితాన్ని మారుస్తుందన్నారు. మిత్రుడు హీరో కావడం ఆనందంగా ఉందన్నారు. ప్రతి వ్యక్తిలో ఒక కల ఉంటుందని, కళ సాదించాలంటే అదృష్టం ఉండాలన్నారు. ఎదగడానికి కష్టానికి ప్రతిఫలం లభిస్తే చెప్పలేని ఆనందం ఉంటుందన్నారు.
సినీరంగంలో రాణించాలంటే కష్టంతో కూడుకున్నదన్నారు. సినీ హీరో కృష్ణ తేజ మాట్లాడుతూ శివరాత్రి పండుగ, గురువుల ఆశీస్సులు ఉండాలని సినిమా పోస్టర్స్ ను విడుదల చేయడం సంతోషంగా ఉందన్నారు. చదువు పూర్తియైన వెంటనే సినీరంగంపై ఉన్న మక్కువతో 15 ఏళ్ళు ఎదురుచూసి  చిన్న, చిన్న క్యారెక్టర్లలో నటించి అందరి మన్ననలతో ఈ స్థాయికి వచ్చానని గుర్తుచేశారు. సినిమాలో ప్రధానంగా సమాజంలో డబ్బులేనిదే పరమాత్మ కూడా గౌరవించరు, కష్టపడితేనె విజయం సొంతమవుతుందనే ఒక మెసేజ్ ను క్రైమ్ సస్పెన్స్ గా, కుటుంబమంతా కలిసి చూసే సినిమా అన్నారు. ప్రతి వ్యక్తి ఎదుగుదలకు, గుర్తింపుకు ప్రధాన పాత్ర మీడియా అన్నారు. చిన్న పాత్రలకే కాకుండా నన్ను దృష్టిలో పెట్టుకొని మంచి సబ్జెక్ట్ తయారు చేశారన్నారు. సినిమాలో పోలీస్ పాత్ర ప్రేక్షకులు ఆదరిస్తారని అన్నారు. గతంలో గుండెజారి గల్లంతయింది, ఖలేజా తదితర సినిమాల్లో నటించానన్నారు. కిరణ్ తిరుమల ఈ సినిమాను రూపొందించారని, సినిమాలోకి రావటానికి స్నేహితుల సహకారం మరువలేనిదన్నారు. అనంతరం కేక్ కట్ చేసి హీరో కృష్ణ తేజను ఘనంగా సన్మానించారు.

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: