ఘనంగా పీసీసీ అధ్యక్షుడు సాకే శైలజానాథ్  జన్మదినం 

(జానోజాగో వెబ్ న్యూస్-కర్నూలు జిల్లా ప్రతినిధి)

 నంద్యాల లోని కాంగ్రెస్ కమిటీ కార్యాలయం ఆవరణంలో పీసీసీ అధ్యక్షుడు, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర రథసారథి, మాజీ మంత్రివర్యులు డాక్టర్ సాకే శైలజానాథ్ జన్మదిన  సందర్భముగా పి సి సి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ చింతల మోహన్ రావు ఆదేశాల మేరకు మజ్జిగ ప్యాకెట్లు పంచటం జరిగింది.
డాక్టర్ సాకే శైలజానాథ్ కాంగ్రెస్ పార్టీకి ఎనలేని సేవలు చేస్తూ రాష్ట్రంలో ఎంత కష్ట సాధ్యమైన పరిస్థితులు నెలకొన్నప్పటికీ రాష్ట్ర అభివృద్ధి కొరకు ప్రత్యేక హోదా సాధన కొరకు విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వ్యతిరేకించడంలో తన శక్తి సామర్థ్యాలను ఎదుర్కొని మొట్టమొదట తన గళం ఢిల్లీలో వినిపించిన నాయకుడు డాక్టర్ సాకే శైలజానాథ్ అన్నారు. ఎప్పటికైనా ఆంధ్ర ప్రదేశ్ కు ప్రత్యేక హోదా కాంగ్రెస్తోనే సాధ్యం అవుతుందని రాజధాని నిర్మాణం గాని పోలవరం పూర్తి చేయడం గానీ 2014లో పార్లమెంటులో ఇచ్చిన హామీలన్నీ కాంగ్రెస్ పార్టీ మాత్రమే ఇవ్వగలుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో పిసీసి అధికార ప్రతినిధి ఉకొట్టు వాసు, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర సేవాదల్ కార్యదర్శి మస్తాన్ ఖాన్, పసుపుల అజయ్ కుమార్, యూత్ కాంగ్రెస్ నాయకులు సాయి కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి 

 

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: