పేద ఆర్యవైశ్యులకు సొంతింటి కల నెరవేర్చండి

- వైస్ చైర్మన్, కౌన్సిలర్లకు సన్మానం

(జానోజాగో వెబ్ న్యూస్-కర్నూలు జిల్లా ప్రతినిధి)

మున్సిపల్ ఎన్నికల్లో ఆర్యవైశ్యులు రాజకీయ ఎదుగుదలకు ఊపిరి పోసారని, పేద ఆర్యవైశ్యుల సొంతింటి కళను నెరవేర్చాలని శ్రీ వాసవీ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు భవనాశి వాసు పేర్కొన్నారు. నంద్యాల అమ్మవారి శాలలో మున్సిపల్ ఎన్నికల్లో గెలుపొందిన ఆర్యవైశ్య కౌన్సిలర్లకు ఆత్మీయ సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వైశ్య ప్రముఖులు మాట్లాడుతూ ఆర్యవైశ్యులు రాజకీయంగా ఎదిగేందుకు ఊపిరిపోశారన్నారు. రాజకీయ కుర వృద్ధులు లగ్గిశెట్టి సుబ్బ గురుమూర్తి మాట్లాడుతూ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన ఖండే శ్యామ్ సుందర్ లాల్ తొడగొట్టి అధికారపార్టీ అభ్యర్థిపై గెలుపొంది ఆర్యవైశ్య సింహం అనిపించుకున్నారని కొనియాడారు. కౌన్సిలర్ ఖండే శ్యామ్ సుందర్ లాల్ మాట్లాడుతూ ఆర్యవైశ్యులు ఓటింగ్లో పాల్గొంటే ఎలా వుంటుందో చూపించారన్నారు. ఆర్యవైశ్యులు అంటే చేతకాని వారు కాదని,  ఆత్మాభిమానం ఉన్నవారిని, కుల దేవత శ్రీ వాసవీ కన్యకాపరమేశ్వరి అమ్మవారు ఆత్మాభిమానాన్ని వదులుకోక ప్రాణత్యాగం చేసిందని, అటువంటి వంశంలో పుట్టిన ఆర్యవైశ్యులు భయాన్ని ప్రారదోలాలన్నారు.
అంతరాత్మకు తప్ప ఎవరికి బయపడొద్దన్నారు. ఆర్యవైశ్యులు ముందుకు వచ్చి గెలిపించినందుకు పాదాభివందనాలు తెలియజేశారు. పట్టణంలో 26 వేల ఆర్యవైశ్యుల ఓట్లు ఉన్నాయని, అభ్యర్థుల గెలుపు ఓటములను శాసించే స్థాయిలో ఉన్నామని,  ఆత్మాభిమానంతో బ్రతుకుదామన్నారు. ఆర్యవైశ్యుల జోలికి ఎవరు రావద్దని అన్నారు. ఆర్యవైశ్య యువకిశోరం గంగిశెట్టి శ్రీధర్ కు మున్సిపల్ వైస్ చైర్మన్ పదవి ఇచ్చిన మాజీ మంత్రి శిల్పా మోహన్ రెడ్డి, ఎమ్మెల్యే శిల్పారవిచంద్ర కిషోర్ రెడ్డిలు  ఆర్యవైశ్యులకు ఉన్నత స్థానం కల్పించడంతో వారికి కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం వైఎస్ ఛైర్మెన్ గంగిశెట్టి శ్రీధర్, కౌన్సిలర్లు ఖండే శ్యామ్ సుందర్ లాల్, కాల్వ సరస్వతి, పరుచూరు  నారాయణమ్మలను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఆర్య వైశ్య ప్రముఖులు పాల్గొన్నారు.

,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి 

 

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: