వార్డు పర్యటనల్లో యువ కౌన్సిలర్లు

- సమస్యలపై సచివాలయ సిబ్బంది, అధికారులతో పర్యటన 

- ఉత్సాహంగా సమస్యలపై సమరానికి సిద్ధమంటున్న కౌన్సిలర్లు 

6వ వార్డులో పర్యటిస్తున్న కౌన్సిలర్ పురంధర్

(జానోజాగో వెబ్ న్యూస్-కర్నూలు జిల్లా ప్రతినిధి)

 ప్రమాణ స్వీకారం పూర్తి చేసిన వెంటనే నూతన కౌన్సిలర్లు వార్డు బాట పట్టారు. సమస్యలను తెలుసుకొని పరిష్కరించేందుకు ఉత్సాహంగా సచివాలయ సిబ్బంది, మునిసిపల్ అధికారులతో కలసి పర్యటిస్తూ, వార్డు సమస్యలను స్థానిక ప్రజల ద్వారా అడిగి తెలుసుకునేందుకు ఉత్సాహం చూపారు. నాలుగో వార్డ్ కౌన్సిలర్ తబ్రేజ్, 6వ వార్డు కౌన్సిలర్ భీమనిపల్లి పురంధర్ కుమార్, పదో వార్డు కౌన్సిలర్ మజీద్ లు శనివారం వార్డుల్లో పర్యటించారు.

అధికారులతో 6వ వార్డులో పర్యటిస్తున్న కౌన్సిలర్ పురంధర్

ముఖ్యంగా శానిటేషన్, నీటి సమస్యలు, కరెంట్ సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వార్డులోని ప్రజలతో సమస్యలను ఆడిగి తెలుసుకుంటూ, వారి సమస్యలను సత్వరమే పరిష్కారం అయ్యే లాగ చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అలాగే సమస్యలను వీలయినంత త్వరగా ఉన్నతాధికారుల ద్రుష్టికి తీసుకు వెళ్లి పరిష్కరిస్తామని ప్రజలకు హామీ ఇచ్చారు. వీరి వెంట వార్డు ప్రజలు, కార్యకర్తలు పాల్గొన్నారు.

సచివాలయ. సిబ్బందితో పర్యటిస్తున్న 10వ వార్డు కౌన్సిలర్ మజీద్

4వ వార్డులో ప్రజలతో కలసి పర్యటిస్తున్న  కౌన్సిలర్ తబ్రేజ్


,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి 

 


Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: