ఆంధ్ర ప్రదేశ్ బేస్ బాల్   అసోసియేషన్,,,

గౌరవ అధ్యక్షురాలుగా శిల్ప నాగినీరెడ్డి

(జానోజాగో వెబ్ న్యూస్-కర్నూలు జిల్లా ప్రతినిధి)

ఆంధ్ర ప్రదేశ్ దేశ్ రాష్ట్ర బేస్ బాల్ సంఘం గౌరవ అధ్యక్షురాలుగా శిల్పా నాగిని రెడ్డి ఎంపికైనట్లు జాతీయ బేస్ బాల్ ఫెడరేషన్ అధ్యక్షులు కృష్ణమూర్తి, ప్రధాన కార్యదర్శి నరేష్ ,రాష్ట్ర బేస్ బాల్ సంఘం ప్రధాన కార్యదర్శి మల్లికార్జున రెడ్డి, సీఈవో మాధవరావు ఆదివారం అధికారికంగా ప్రకటించారు. శిల్ప నాగినిరెడ్డి రాష్ట్ర  బేస్ బాల్ గౌరవ అధ్యక్షురాలుగా ఎంపిక అయినందుకు ఆంధ్ర ప్రదేశ్  బాల్ బ్యాట్మెంటన్ అధ్యక్షులు, రోటరీ గవర్నర్ చిన్నపరెడ్డి, రాష్ట్ర హాకీ సంఘం సహా అధ్యక్షులు చాణక్య రాజు, జిల్లా ఒలింపిక్ సంఘం చైర్మన్ డాక్టర్ రవి కృష్ణ , జిల్లా ఖోఖో సంఘం అధ్యక్షులు సుబ్బారెడ్డి, గురు రాఘవేంద్ర విద్యాసంస్థల డైరెక్టర్ లు మౌలాలి రెడ్డి, షావలి రెడ్డి, లయన్స్ క్లబ్ అధ్యక్షులు మనోహర్ రెడ్డి, లయన్స్ క్లబ్ జిల్లా చైర్మన్ బైసాని రమేష్, రోటరీ క్లబ్ అధ్యక్షులు డాక్టర్ విజయ భాస్కర్ రెడ్డి, బేస్ బాల్ సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు రమణ, సుబ్బయ్య తదితరులు అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా గౌరవ అధ్యక్షురాలుగా ఎంపికైన శిల్పా నాగిని రెడ్డి  మాట్లాడుతూ బేస్ బాల్ క్రీడ అభివృద్ధికి అవసరమైన సహకారం అందజేస్తామన్నారు. రాష్ట్ర క్రీడాకారులు జాతీయ జట్టుకు ఎక్కువమంది ఎంపిక కావాలని ఆకాంక్షించారు.

,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి 

 

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: