నూతనంగా ఎన్నికైన దూదేకుల జైనాబి, భావమ్మలను,,,

సన్మానించిన నంద్యాల దూదేకుల సంఘం

(జానోజాగో వెబ్ న్యూస్-కర్నూలు జిల్లా ప్రతినిధి)

నూతనంగా ఎన్నికైన దూదేకుల జైనాబి, భావమ్మలను నంద్యాల దూదేకుల సంఘం నాయకులు ఘనంగా సన్మానించారు. ఆదివారం స్థానిక నూర్ నర్సింగ్ హోమ్ ఆవరణలో నంద్యాల దూదేకుల సంఘం అధ్యక్ష, కార్యదర్సులు ఖాసీం, దస్తగిరిల ఆధ్వర్యంలో ప్రజా ప్రతినిధులుగా ఎన్నికైన 27వ వార్డ్ కౌన్సిలర్ జైనాబి, కానాల సర్పంచ్ భావమ్మలను ఘనంగా సన్మానించారు.

ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధులుగా హాజరైన దూదేకుల సంఘం రాష్ట్ర గౌరవ అధ్యక్షులు డా.బాబన్, రాష్ట్ర నాయకులు దస్తగిరి పర్ల, ప్రముఖ స్త్రీ వ్యాధి నిపుణులు డా.ఫాతిమా, మహిళా నాయకురాలు సోక్రభి, వాసవి దస్తగిరి తదితరులు మాట్లాడుతూ రాష్ట్ర స్థాయిలో స్థానిక సంస్థలకు దూదేకుల వారు చాలా చోట్ల ప్రజాప్రతినిధులుగా  ఎన్నికవటం సంతోషకరమన్నారు. ఈ కార్యక్రమంలో కోశాధికారి హుసైన్ బాషా, మాజీ కౌన్సిలర్ దస్తగిరి, కానాల హుసైన్, కమిటీ సభ్యులు టైలర్ సుభాన్, పాపన్న, సోమశేకర్, బాదుల్లా, రసూల్, ఎంపిటిసి సుభాహన్, బాబు, నాగరాజు, పరుపుల దస్తగిరి, తెలుగుపేట హుసేన్ తదితరులు పాల్గొన్నారు

,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి 

 

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: