అంగరంగ వైభవంగా కొలువుదీరిన నూతన కౌన్సిల్ 

చైర్మన్ గా  షేక్ మాబుని

వైస్ చైర్మన్ గా గంగిశెట్టి శ్రీధర్

ఆర్భాటంగా ప్రమాణ స్వీకారం 

పాల్గొన్న ఎంపి పోచా, ఎమ్మెల్యే శిల్పా రవి 


చైర్మన్ గా ప్రమాణం స్వీకారం చేస్తున్న షేక్ మాబుని

(జానోజాగో వెబ్ న్యూస్-కర్నూలు జిల్లా ప్రతినిధి)

నంద్యాల పురపాలక సంఘం చైర్మన్ గా షేక్ మాబుని, వైస్ చైర్మన్ గా గంగిశెట్టి వెంకట నాగ శ్రీధర్ ఏకగ్రీవంగా ఎన్నిక  కాబడ్డారని జిల్లా జయింట్ కలెక్టర్, ప్రత్యేక అధికారి రామ సుందర్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ వెంకట కృష్ణ తెలియ జేశారు. గురువారం నంద్యాల మున్సిపల్ జేసీ రామ సుందర్ రెడ్డి అధ్యక్షతన నూతనంగా ఎన్నిక కాబడిన మున్సిపల్ కౌన్సిలర్ లను తొలుతగా ప్రమాణ స్వీకారం చేయించారు. మున్సిపల్ చైర్మన్ ఎన్నికల ప్రక్రియను ప్రారంభించారు. మున్సిపల్ చైర్ పర్సన్ గా షేక్ మాబుని 18వ వార్డు కౌన్సిలర్ దేశం సులోచన ప్రతిపాదించగా 14వ వార్డు  కౌన్సిలర్ ఆళ్లగడ్డ విమలమ్మ బలపరిచి ఏకగ్రీవంగా ఎన్నిక చేసుకున్నారు. మున్సిపల్ వైస్ చైర్మన్ గా గంగిశెట్టి వెంకట నాగ శ్రీధర్ ను 25 వ వార్డు కౌన్సిలర్ కృష్ణమోహన్ ప్రతిపాదించగా 28వ వార్డు కౌన్సిలర్ పామ్ షావలి బలపరిచి గంగిశెట్టి శ్రీధర్ ను వైస్ చైర్మన్ గా ఎన్నుకోవడం జరిగింది.

అనంతరం జేసీ మాట్లాడుతూ కొత్త కౌన్సిలింగ్ ను నియమ నిబంధనల ప్రకారం కౌన్సిలర్ల చేత ప్రమాణ స్వీకారం చేయించామని, అనంతరం మునిసిపల్ చైర్ పర్సన్, వైస్ చైర్ పర్సన్ ల ఎంపిక కూడా నియమ నిబంధనల ప్రకారం చేయడం జరిగిందన్నారు. కొత్తగా ఎంపిక కాబడిన నంద్యాల మున్సిపల్ కౌన్సిల్ ప్రస్తుత సమాజంలో గడగడలాడిస్తున్న కోవిడ్ ను నియంత్రించేందుకు కృషి చేయాలని నంద్యాల ప్రాంతంలో పుణ్యక్షేత్రాలకు ఇతర రాష్ట్రాల నుండి అనేకమంది భక్తులు వస్తూ ఉంటారని కోవిడ్ వ్యాప్తి చెందే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కావున మున్సిపల్ కౌన్సిల్ కోవిడ్ పై ప్రత్యేక దృష్టి సారించి నంద్యాల పట్టణంలోని ప్రజలు ను మన ప్రభుత్వము ప్రతిష్టాత్మకంగా ప్రజల ఆరోగ్యాలను కాపాడాలనే ఉద్దేశంతో వ్యాక్సిన్ ను కూడా  తయారు చేసిందని వ్యాక్సిన్ కూడా ప్రభుత్వ ఆసుపత్రులలో సిద్ధంగా ఉన్నది ఈ వ్యాక్సిన్ పై ఎలాంటి అపోహలు పెట్టుకోకుండా వ్యాక్సిన్ తీసుకోవాలన్నారు ప్రతి ఒక్కరూ సామాజిక దూరం పాటిస్తూ మాస్కులు ధరించి కోవిడ్ నియంత్రణకు కృషి చేయాలని కొత్త కౌన్సిల్కు కు ఆయన సూచించారు.

 చైర్మన్ ను అభినందిస్తున్న మాజీ చైర్మన్ దేశం సులోచన, ఎంపి పోచా, ఎమ్మెల్యే శిల్పా తదితరులు

నూతనంగా ఎంపిక కాబడిన చైర్ పర్సన్ షేక్ మాబుని మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆశీర్వాదాలతో నంద్యాల పట్టణానికి పేదరాలైన ముస్లిం మహిళను చైర్ పర్సన్ గా  ఎంపిక చేసినందుకు ధన్యవాదాలు అని,  అలాగే స్థానిక ఎంపి పోచ బ్రహ్మానంద రెడ్డి, ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి సహాయ సహకారాలతో చైర్మన్ గా ఎంపిక అయ్యానని, పురపాలక సంఘాన్ని అభివృద్ధి పథంలో నడిపించుటకు నా సాయ శక్తులా కృషి చేస్తానని అన్నారు. వైస్ చైర్మన్ గంగిశెట్టి శ్రీధర్ మాట్లాడుతూ సీఎం జగన్ ఆశీర్వాదాలతో ఎంపి పోచా, ఎమ్మెల్యే శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి, వార్డు ప్రజల ఆశీర్వాదాలతో  వైస్ చైర్మన్ పదవికి ఎంపిక కావడం నాకెంతో ఆనందంగా ఉందన్నారు. నంద్యాల పురపాలక సంఘాన్ని అభివృద్ధి పథంలో నడిపించడానికి నా సహాయ శక్తుల కృషి చేస్తానని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో  మునిసిపల్ కౌన్సిలర్లు పాల్గొన్నారు.

వైస్ చైర్మన్ గంగిశెట్టి శ్రీధర్

చైర్మన్ ను అభినందిస్తున్న ఎమ్మెల్యే శిల్పా, ఎంపి పోచా 

చైర్మన్ ను అభినందిస్తున్న మాజీ చైర్మన్ దేశం సులోచన, ఎంపి పోచా, ఎమ్మెల్యే శిల్పా తదితరులు

 


,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి 

 


Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: