రైతులకు విరివిగా పంట రుణాలు ఇవ్వండి

వ్యవసాయం, వ్యవసాయాధారిత రంగాలకు సకాలంలో రుణాలిచ్చి ప్రోత్సహించండి

డీసీసీ, డీఎల్‌ఆర్‌సీ సమీక్ష సమావేశంలో బ్యాంకర్లకు సూచించిన జిల్లా కలెక్టర్ వీరపాండియన్

జిల్లా కలెక్టర్ వీరపాండియన్

(జానోజాగో వెబ్ న్యూస్-కర్నూలు జిల్లా ప్రతినిధి)

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్ధిదారులకు స్వయం ఉపాధి కోసం ప్రభుత్వం అందిస్తున్న సహాయానికి  బ్యాంకర్లు ముందుకు వచ్చి రుణాలు ఇవ్వండని 2021- 2022 వార్షిక ప్రణాళిక టార్గెట్ 17257.00 కోట్లు అని, పంట రుణాలు విరివిగా ఇచ్చి రైతులను ఆదుకోవాలని కలెక్టర్‌ జి వీరపాండియన్‌ బ్యాంకర్లను ఆదేశించారు. శనివారం స్థానిక కలెక్టరేట్ కలెక్టర్ వారి కార్యాలయం నుండి డీసీసీ, డీఎల్‌ఆర్‌సీ సమీక్షలో ప్రభుత్వ సంక్షేమ పథకాలు సబ్సిడీ రుణాలపై బ్యాంకర్లు, అధికారులతో జిల్లా కలెక్టర్ జి వీరపాండియన్ జూమ్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించారు. జాయింట్ కలెక్టర్ (సంక్షేమం) సయ్యద్ ఖాజా మోహిద్దీన్, ఆర్బిఐ హైదరాబాద్ ఏజిఎం చంద్రకాంత్, నాబార్డు ఏజీఎం పార్థసారథి, ఎల్‌డీఎం వెంకట నారాయణ, డిఆర్డీఏ ఏపీడి శ్రీధర్ రెడ్డి, జిల్లా పరిశ్రమల శాఖ జోనల్ మేనేజర్ సోమశేఖర్ రెడ్డి, పశు సంవర్ధక శాఖ జెడి డాక్టర్. రమణయ్య, చేనేత మరియు జౌళి శాఖ ఏడి వెంకటేశ్వర్లు, అగ్రికల్చర్ జెడి ఉమామహేశ్వరమ్మ, ఈ డి మైనార్టీ కార్పొరేషన్ పర్వీన్ భాను, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ చంద్రశేఖర్, సోషల్ వెల్ఫేర్ డిడి రమాదేవి, డిటిడబ్ల్యూ రమాదేవి, జిల్లా స్థాయి అధికారులు, బ్యాంకర్లు, తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జి వీరపాండియన్ మాట్లాడుతూ ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్ధిదారుల స్వయం ఉపాధి కోసం ప్రభుత్వం అందిస్తున్న ఉచిత ఆర్థిక సహాయానికి తోడుగా బ్యాంకర్లు కూడా ముందుకు వచ్చి విరివిగా రుణాలను ఇవ్వాలని బ్యాంకర్లకు సూచించారు. వ్యవసాయం, వ్యవసాయాధారిత రంగాలకు సకాలంలో రుణాలిచ్చి ప్రోత్సహించాలని బ్యాంకర్లకు సూచించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలకు రుణాలను వెంటనే ఇవ్వాలని సూచించారు. జిల్లాలో రుణాల పంపిణీ లక్ష్యాలను చేరుకోవాలని ఆదేశించారు. పొదుపు మహిళలకు జీవనోపాధి రుణాలు కూడా సకాలంలో అందేలా చూడాలన్నారు. 30-12-2020 నాటికి రైతులకు పంట రుణాలకు సంబంధించి 7240.00 కోట్లకు గాను 83.05 శాతం సాధించారన్నారు. ఖరీఫ్ సీజన్ కు సంబంధించి రూ.4412.54 కోట్ల పంట రుణం లక్ష్యం కాగా, 105.64 శాతం సాధించారు. ఖరీఫ్ సీజన్ కు సంబంధించి రూ.2827.46 కోట్ల పంట రుణం లక్ష్యం కాగా 47.81 శాతం సాధించారు. వ్యవసాయ రంగానికి సంబంధించి లక్ష్యం 9086 కోట్లు కాగా అందులో 82.19 శాతం సాధించారు. 2020-2021 వార్షిక ప్రణాళిక టార్గెట్ 15580 కోట్లు కాగా అందులో 30-12-2020 నాటికి 70.20 శాతం అచీవ్ అయ్యారని అన్నారు. వైయస్సార్ బీమా జగనన్న తోడు, పీఎం స్వనిధి, వైయస్సార్ ఆసరా, సున్నా వడ్డీ, చేయూత, జగనన్న జీవ క్రాంతి తదితర ప్రభుత్వ పథకాల ప్రతి లబ్దిదారునికి పెండింగ్ లేకుండా వెంటనే రుణాలు మంజూరు చేసి గ్రౌండింగ్ చేయాలన్నారు. ప్రతి బ్యాంకు అధికారి రోజువారీ టార్గెట్ పెట్టుకొని ప్రభుత్వ సంక్షేమ పథకాలకు సంబంధించి దరఖాస్తులను పెండింగ్ లేకుండా అర్హులైన ప్రతి ఒక్కరికి రుణాలు మంజూరు చేసి వ్యాపారాభివృద్ధికి తోడ్పడాలన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలకు సంబంధించి సబ్సిడీ రిటర్న్స్ చెయ్యకపోతే సంబంధిత బ్యాంకు అధికారులపై చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ హెచ్చరించారు.

2021-2022 వార్షిక ప్రణాళిక టార్గెట్ 17,257.00 కోట్లు :- 

*క్రాప్ ప్రొడక్షన్ టార్గెట్  8287.00 కోట్ల రూపాయలు, ఖరీఫ్ సీజన్ సంబంధించి  5460.00 కోట్లు, రబీ సీజన్ 2827.00 కోట్లు, టర్మ్ లోన్స్ 1975.00 కోట్లు, అగ్రి ఇన్ఫ్రాస్ట్రక్చర్ 210.00 కోట్లు, ఫుడ్ ఆగ్రో ప్రాసెసింగ్ 136.00 కోట్లు, వ్యవసాయ రంగానికి సంబంధించి లక్ష్యం రూ. 10608 కోట్లు, ఎం ఎస్ ఎం ఈ 1940.00 కోట్లు, ఎక్స్పోర్ట్ క్రెడిట్ 4.00 కోట్లు, అధర్ ప్రియరిటీ సేక్టర్ 964.00 కోట్లు, టోటల్ ప్రియరిటీ సేక్టర్ 13516.00 కోట్లు, నాన్ ప్రియరిటీ సేక్టర్ 3741.00 కోట్లు, వార్షిక ప్రణాళిక టార్గెట్ 17,257.00 కోట్లు రూపాయలు కేటాయించారు.

,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి 

 

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: