స్నేహ వృద్ధాశ్రమంలో అన్నదానం

(జానోజాగో వెబ్ న్యూస్-కర్నూలు జిల్లా ప్రతినిధి)

నంద్యాల పట్టణ శివారులోని స్నేహ వృద్ధాశ్రమంలో అన్నదానం నిర్వహించారు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ జన్మదిన వారోత్తవాల్లో భాగంగా నంద్యాల సీనియర్ మెగా అభిమాని సి.లక్ష్మీకాంత్, జనసేన నాయకులు వై.విశ్వనాథ్ అధ్యర్యంలో అన్నదానం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రామ్ చరణ్ పుట్టిన రోజు  27ను పురస్కరించుకొని వారం రోజులు వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు.
ప్రజలకు మొదటి రోజు చల్లని మజ్జిగ అందించామని, రెండవరోజు పచ్చర్ల సమీపంలోని అటవీ ప్రాంతంలోని మూగ జీవాలకు అభిమానులతో కలసి కోతులకు పండ్లు, మంచినీరు అందించామన్నారు. నేడు స్నేహా వృద్ధాశ్రమంలో ఆశ్రయం పొందుతున్న తల్లిదండ్రులు లాంటి వారికి అన్నదానం చేయడం సంతోషాన్ని ఇచ్చిందన్నారు. ప్రియతమ నాయకుడు జన్మదినం వరకు సేవాకార్యక్రమాలు చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో అభిమానులు పాల్గొన్నారు.

,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి 

 

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: