ఒంగోలులో ప్రారంభమైన,,,
ఎవాల్యూషన్ అవగాహన కార్యక్రమం
హాజరైన ప్రకాశంజిల్లా ఎస్పీ సిద్దార్ద్ కౌశల్
ప్రకాశం జిల్లా సూపరిండెంట్ ఆఫ్ పోలీస్ సిద్దార్ధ్ కౌశల్ (ఐ.పి.ఎస్)
(జానోజాగో వెబ్ న్యూస్-ఒంగోలు ప్రతినిధి)
ప్రకాశం జిల్లా ఒంగోలులోని పోలీస్ కళ్యాణమండపం నందు జూనియర్ ఇన్వెస్టిగేషన్ అధికారుల ఎవాల్యూషన్ అవగాహన కార్యక్రమానికి గురువు -1 (మెంటర్ -1) అధికారిగా ప్రకాశం జిల్లా ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్ (ఐపీఎస్) హాజరయ్యారు. అదేవిధంగా ఎస్పీ ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా అన్ని సబ్ డివిజన్ లలో మెంటర్ -1 అధికారులు అయిన అడిషనల్ ఎస్పీ స్ధాయి అధికారులు, డిఎస్పిలు స్ధాయి అధికారులు సబ్ డివిజన్ లో ఇన్స్పెక్టర్, సబ్ ఇన్స్పెక్టర్, జూనియర్ ఇన్వెస్టిగేషన్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఒంగోలు వన్ టౌన్, టూ టౌన్, తాలూకా, కొత్తపట్నం,దిశ పోలీస్ స్టేషన్ కు ప్రకాశం జిల్లా ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్ మెంటర్ -1 గా పోలీస్ కల్యాణ మండపంలో సమావేశం నిర్వహించారు.
మార్కాపురం డీఎస్పీ ఎమ్. కిషోర్ కుమార్
అదేవిధంగా జిల్లాలో ఉన్న సబ్ డివిజన్ లలోని చీరాల వన్ టౌన్, టు టౌన్, రూరల్ పోలీస్ స్టేషన్ లో కె.చౌడేశ్వరి, మార్కాపురం సబ్ డివిజన్ లో వై.పాలెం సర్కిల్ లో అడిషనల్ ఎస్పీ (అడ్మిన్) బి.రవి చంద్ర ,ఒంగోలు రూరల్ సర్కిల్లో ఒంగోలు డిఎస్పీ కె.వి.వి.ఎన్.వి. ప్రసాద్, సింగరాయకొండ సర్కిల్ లో ఎస్సీ, ఎస్టీ డిఎస్పి పి.సురేష్ కుమార్ ఇంకొల్లు సర్కిల్ చీరాల డిఎస్పిపి. శ్రీకాంత్, అద్దంకి సర్కిల్ లో డిఎస్పి కె.ప్రకాష్ రావు, దర్శి సర్కిల్ లో డిసిఆర్బి డిఎస్పి ఏ.వి రమణ, పొదిలి సర్కిల్ దిశా పోలీస్ స్టేషన్ డిఎస్పీ యం.ధనుంజయుడు, గిద్దలూరు సర్కిల్ మార్కాపురం డిఎస్పీ యం.కిషోర్ కుమార్, కందుకూరు సర్కిల్ ట్రాఫిక్ డిఎస్పి యన్.సురేంద్ర, కనిగిరి సర్కిల్ కందుకూరు డిఎస్పి కె.శ్రీనివాసులు, పామూరు సర్కిల్ సిసిఎస్ డిఎస్పి ఏ.ప్రసాద్ కుమార్ మెంటర్ -1 అధికారులుగా జిల్లాలో సమావేశలు నిర్వహించి సీనియర్ అధికారులకు సూచనలు చేసినారు. ఈ సందర్భంగా ఎస్పీ సిద్దార్ద్ కౌశల్ మాట్లాడుతూ ఒంగోలు వన్ టౌన్ కు చెందిన జియో కె.రామిరెడ్డి ఒక్క కేసు కూడా నమోదు చేయలేదని త్వరితగతిన కేసులు నమోదు చేసి దర్యాప్తు పై అవగాహన పెంచుకోవాలని సూచించారు. అదేవిధంగా ఒంగోలు వన్ టౌన్ కు చెందిన ఏఎస్ఐ బాబురావు సీడీ ఫైల్ ను పరిశీలించి అందులోని మధ్యవర్తినామ చాలా బాగా ఉందని ఇదే తరహాలో మరింత మెరుగ్గా దర్యాప్తులో మెళకువలు నేర్చుకోవాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో ఒంగోలు వన్ టౌన్, టు టౌన్, తాలూకా, కొత్తపట్నం మరియు దిశా పోలీస్ స్టేషన్ లోని జూనియర్ ఇన్వెస్టిగేషన్ అధికారుల మరియు సీనియర్ అధికారులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఎస్పీ గారు మాట్లాడుతూ జూనియర్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్లు నమోదు చేసిన కేసుల దర్యాప్తు గురించి అడిగి తెలుసుకున్నారు. పై అధికారుల సూచనలు తీసుకుంటూ దర్యాప్తును వేగవంతంగా పూర్తి చేసి, కేసులలోని పిర్యదిదారులకు స్వత్వర న్యాయం జరిగేల చూడాలని జియో ప్రాజెక్ట్ యొక్క ముఖ్య ఉద్దేశ్యం ఇదేనని ఎస్పీ గారు తెలియజేశారు. అదేవిధంగా కేసుల దర్యాప్తు లో జియో లకు అన్ని రకాల సహాయ సహకారాలు అందించి వారిని ఉత్తమ దర్యాప్తు అధికారులుగా తీర్చిదిదాలని సూచించారు. జియో ప్రాజెక్టు ప్రారంభించక మునుపు జిల్లాలో కేవలం 30 శాతం కేసులు మాత్రమే జియోలు దర్యాప్తు చేయడం జరిగిందని ఈ జియో ప్రాజెక్టు ప్రారంభించటం వలన జిల్లాలో 90 శాతం కేసులు జూనియర్ అధికారులే దర్యాప్తు చేయడం జరిగిందని పేర్కొన్నారు.
అదేవిధంగా ఒంగోలు, చీరాల, దర్శి, మార్కాపురం మరియు కందుకూరు సబ్ డివిజన్ లలో 13 మంది సీనియర్ అధికారులతో ప్రతి 15 రోజులకు ఒకసారి ఈ మెంటార్ షిప్ కార్యక్రమం జరుగుతుందని ఎస్పీ గారు తెలియజేశారు. అదే విధంగా జిల్లాలో జూనియర్ ఇన్వెస్టిగేషన్ అధికారుల 456 మంది ఉన్నారని వారు14820 కేసులు నమోదు చేసివున్నారని, వాటిలో 14211 కేసులు దర్యాప్తు పూర్తి అయినట్లు తెలియచేసినారు. మిగిలిన కేసులలో కూడా దర్యాప్తు వేగవంతగా పూర్తి చేసే విధంగా సూచనలు చేసినారు. అదే విధంగా అందరు జియోలు సమానంగా కేసులు నమోదు చేసే విధంగా మరియు కొత్తగా ప్రొమోషన్ తీసుకున్న జియోలు కేసులు నమోదు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. పోలీస్ స్టేషన్ లోని ఇద్దరు జియోలను ఒక బుడ్డిపెయిర్ గా ఏర్పాటు చేసి వారిలో దర్యాప్తులో మెరుగుగా ఉన్న జియో, దర్యాప్తులో వెనుకబడిన జియోతో అన్ని విషయాలలో సహాయ సహకారాలు అందించుకోనేలా ఏర్పాటు చేయటం జరిగిందని తెలియచేసినారు. ఈ కార్యక్రమంలో డిటిసి డిఎస్పి జి రామకృష్ణ, డిఎస్పి బి.మరియాదాసు, ఇన్స్పెక్టర్ లు యన్. శ్రీకాంత్ బాబు, ఆర్.రాంబాబు, ఫిరోజ్, సబ్ డివిజన్ అధికారులు మరియు జియో సిబ్బంది పాల్గొనారు.
✍️ రిపోర్టింగ్-షేక్ గౌస్ బాషా
జానోజాగో వెబ్ న్యూస్-బ్యూరో చీఫ్
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,
రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి
Post A Comment:
0 comments: