హోంమంత్రి చేతుల మీదుగా...

‘గుమ్ నామ్ ముజాహిదె ఆజాదీ షేర్ అలీ ఖాన్ ఆఫ్రీదీ’’ పుస్తకావిష్కరణ

(జానోజాగో వెబ్ న్యూస్-హైదరాబాద్ బ్యూరో)

షేర్ అలీ ఖాన్ అఫ్రీదీ... ఆజాదీ లడాయీలో ఉరికంబమెక్కిన యోధుడు. కానీ ఫ్రీడమ్ ఫైటర్స్ జాబితాలో ఈయన పేరు మనకు ఎక్కడా కానరాదు. 1873 మార్చి 11న అంటే ఇదే రోజు ఆయన భారత స్వాతంత్ర్యం కోసం ఉరికంబాన్ని ముద్దాడారు. ఈ సందర్భంగా అలీగఢ్ కు చెందిన ప్రముఖ రచయిత షాహెద్ సిద్దీఖీ ‘గుమ్ నామ్ ముజాహిదె ఆజాదీ షేర్ అలీ ఖాన్ ఆఫ్రీదీ’’ శీర్షికతో ఒక పుస్తకాన్ని రచించారు. హోమ్ మినిస్టర్ మహమూద్ అలీ ఆ పుస్తకాన్ని ఈ రోజు ఆవిష్కరించారు. అప్పటి వైస్రాయ్ ఆఫ్ ఇండియా లార్డ్ మేయోను హత్యచేసినందుకు గాను షేర్ అలీ ఖాన్ కు 1873లో అప్పటి బ్రిటీష్ గవర్నమెంటు ఆయన్ను ఉరితీసింది. ఒకవైపు ఆజాదీ అమృత మహోత్సవాలను ఘనంగా జరుపుకుంటున్న సందర్భంగా ముస్లిమ్ స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను గుర్తించి వారి చరిత్రను వెలికితీసి ప్రాచుర్యం కల్పించాలని పలువురు అభిప్రాయ పడుతున్నారు. ఈ ఆవిష్కరణ సభలో టీయారెస్స్ లీడర్ ఖాన్ షహెబాజ్ అలీ ఖాన్, ప్రొఫెసర్ డాక్టర్ ఇస్లాముద్దీన్ ముజాహిద్ పాల్గొన్నారు. 

✍️ రిపోర్టింగ్-ముహమ్మద్ ముజాహిద్

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: