సిలిండర్ కు దండంపెట్టోచ్చి ఓటు వేసినా

పట్ట భద్రులు ఓటు హక్కును వినియోగించుకోవాలి

మంత్రి కేటీఆర్

(జానోజాగో వెబ్ న్యూస్-లీగల్ ప్రతినిది)

ఇంట్లోనుంచి వచ్చేటప్పుడు సిలిండర్ కు నమస్కారం చేసి ఓటేసేందుకు వచ్చానని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. మహబూబ్ నగర్, హైదరాబాద్ రంగారెడ్డి, జిల్లాలకు చెందిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆదివారం కొనసాగుతున్న పోలింగ్ లో భాగంగా తెరాస పార్టీ అధ్యక్షులు, మంత్రి కె. తారకరామారావు, ఎమ్మెల్యే దానం నాగేందర్ లు తమ ఓటును వేశారు. అనంతరం మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ ఓ మహానుభావుడు చెప్పినట్లు ఇంట్ల ఉన్న సిలిండర్ కు నమస్కారం చేసి బయటికి వెళ్ళాలని తెలిపినట్లుగా పేర్కొన్నారు. పట్టభద్రులు తమ ఓటహక్కును విధిగా వినియోగించుకోవాలని సూచించారు. అర్హత గల అభ్యర్థికే తాను ఓటు వేశానని, విద్యావంతులకు మేలు చేసేందుకు కృషి చేసే అభ్యర్థికి ఓటు వేసినట్లుగా తెలిపారు. పట్టభద్రులు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు.

(తాజా వార్తల కోసం...ప్రత్యేక విషాల కోసం jaanojaagotv నీ Subscribe చేసుకోండి)

ఇదిలావుంటే హైద‌రాబాద్‌లోని బంజారాహిల్స్‌లోని నీటిపారుదలశాఖ కార్యాలయంలో పోలింగ్‌ కేంద్రంలో నగర మేయర్‌ విజయలక్ష్మి,  షేక్‌పేట తహసీల్దార్‌ కార్యాలయంలో జీహెచ్ఎంసీ మాజీ మేయర్‌ బొంతు రామ్మోహన్ ఓట్లు వేశారు. కోదాడలో ఎమ్మెల్యే మల్లయ్యాదవ్ ఓటు హ‌క్కును వినియోగించుకున్నారు. అలాగే, యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో కలెక్టర్ అనితా రామచంద్రన్ ఓటు వేశారు. మహబూబాబాద్‌ పట్టణంలో ఎమ్మెల్యే భానోత్‌ శంకర్‌నాయక్‌ దంపతులు ఓట్లు వేశారు. దేవరకొండలో ఎమ్మెల్యే రవీంద్రకుమార్, మిర్యాలగూడ పట్టణంలోని బకల్‌వాడి పాఠశాలలో ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్‌రావు ఓటు హ‌క్కును వినియోగించుకున్నారు. ముషీరాబాద్ పోలింగ్ కేంద్రంలో ఓటు హక్కును వినియోగించుకున్న న్యాయవాది ఇంద్రసేనారెడ్డి, సీసియర్ తెరాస నాయకులు ముదిగొండ మురళి ఓటు హక్కును వినియోగించుకున్నారు.

ఓటు హక్కును వినియోగించుకొన్న న్యాయవాది ఇంద్రసేనారెడ్డి, సీసియర్ తెరాస నాయకులు ముదిగొండ మురళి

 

✍️ రిపోర్టింగ్-డి.అనంత రఘు

న్యాయవాది. హైదరాబాద్

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: