విద్యార్థి, యువజన సమాఖ్య ఆధ్వర్యంలో...
నంద్యాలలో బంద్ విజయవంతం
బీజేపీ ప్రభుత్వానికి పుట్టగతులుండవు
పీడీఎస్ యూ-ఏఐఎస్ఎఫ్, బీసీ, ఎస్సి, ఎస్టీ, మైనార్టీ విద్యార్థి, యువజన సమాఖ్య
(జానోజాగో వెబ్ న్యూస్-కర్నూలు జిల్లా ప్రతినిధి)
భారత్ బంద్ సందర్భంగా నంద్యాలలో పీడీఎస్ యూ-ఏఐఎస్ఎఫ్, బీసీ, ఎస్సి, ఎస్టీ, మైనార్టీ విద్యార్థి, యువజన సమాఖ్య ఆధ్వర్యంలో స్థానిక నంద్యాల బస్టాండ్ నుండి ప్రారంభం అయిన బంద్ నంద్యాల పట్టణంలో ఉన్న అన్ని విద్యాసంస్థలను, ఎల్ఐసీ ఆఫీస్, పోస్ట్ ఆఫీస్, వివిధ బ్యాంకులను కూడా స్వచ్ఛంధంగా, శాంతియుతంగా బంద్ నిర్వహించడం జరిగిందని పీడీఎస్ యూ జిల్లా సహాయ కార్యదర్శి ఎస్ఎండీ రఫీ, ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు ధనుంజయుడు, బీసీ, ఎస్సి, ఎస్టీ, మైనార్టీ విద్యార్థి,యువజన సమాఖ్య జిల్లా అధ్యక్షుడు శివకృష్ణ యాదవ్ లు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం నిత్యావసర సరుకుల ధరలను విచ్చలవిడిగా పెంచుతూ దేశంలో ఉన్న మొత్తం ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేట్ శక్తులకు అమ్మడాన్ని వ్యతిరేకిస్తూ, విశాఖ ఉక్కును ప్రైవేటీకరణను ఆపివేయలని కోరుతూ వామపక్ష పార్టీలు, కార్మిక సంఘాలుగా, విద్యార్థి, యువజన సంఘాల ఆధ్వర్యంలో ఎన్ని కార్యక్రమాలు చేస్తున్నా కూడా ఏ మాత్రం పట్టించుకోకుండా దున్నపోతు మీద వర్షం పడుతున్నట్టు వ్యవహరిస్తున్న బిజెపి ప్రభుత్వానికి పుట్టగతులు లేకుండా చేస్తామని వారు తెలిపారు.
బిజెపి ప్రభుత్వం ఇప్పటికయినా ప్రభుత్వం తమ నిర్ణయాన్ని మార్చుకొని రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేసి, విశాఖ ప్రైవేటీకరణను ఆపివేయాలని, నిత్యావసర ధరలను తగించాలని లేని పక్షంలో ప్రజలందరినీ ఏకతాటిపై తెచ్చి ప్రజా ఉద్యమాలకు శ్రీకారం చూడతామని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పీడీఎస్ యూ డివిజన్ నాయకులు అఖిల్, ఏఐఎస్ఎఫ్నంద్యాల డివిజన్ కార్యదర్శి సురేష్, జిల్లా కార్యవర్గ సభ్యుడు హరికృష్ణ, ఏఐవైఎఫ్ అధ్యక్ష,కార్యదర్శులు విష్ణు, చైతన్య ఏఐఎస్ఎఫ్ నాయకులు ప్రదీప్, మహేష్, అంజి, బీసీ సంఘం నాయకులు పాల్గొన్నారు.
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,
రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి
Post A Comment:
0 comments: